తెలంగాణ

పాడి పరిశ్రమ అభివృద్ధికి రూ. 900 కోట్ల రుణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమదేవరపల్లి, ఆగస్టు 11: పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం రాష్ట్రంలోని నాలుగు డెయిరీలలో రెండు లక్షల 13 వేల మందికి పాడి గేదెల యూనిట్ల మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వం 900 కోట్లు మంజూరు ఇచ్చిందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ, పాడిపరిశ్రమ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పేర్కొన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్‌లో మొట్టమొదటిసారిగా పాడిపశువుల పంపిణీ కార్యక్రమం శనివారం హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్‌కుమార్ అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పాడి రైతుల ఆర్థిక బలోపేతం కోసం రాష్ట్ర ప్రభు త్వం ప్రతి లీటరుకు నాలుగు రూపాయలు అదనంగా అం దిస్తూ ప్రోత్సహిస్తోందన్నారు. కేవలం ముల్కనూర్ ఒక్క డెయిరీలో 23 వేల మంది సభ్యులకు ప్రతి నెల 60 లక్షల రూపాయలు బోనస్ రూపంలో అందిస్తోందన్నారు. ప్రతి లీటరు పాలకు అదనంగా నాలు గు రూపాయలు కావాలని ముల్కనూర్ డెయిరీ సభ్యులు 100 మంది ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అడిగిన సమయంలో వారికి సీఎం రెండు వరాలు ఇచ్చారని, మొదటగా డెయిరీ సభ్యులందరికీ యాభై శాతం సబ్సిడీపై పాడిగేదెలు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. లబ్ధిదారులే నేరుగా వారి ఇష్టం ఉన్నచోట గేదెలను కొనుగోలు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు.
మూడు సంవత్సరాల వరకు పాడిగేదెకు బీమా సౌకర్యం కల్పించినట్లు, మూడు నెలలకు సరిపడా దాణా ఉచితంగా అందించడం సీఎం గతం లో హామీలో ఒకటిగా పేర్కొన్నారు. అదే విధం గా పాడిరైతులకు రెండు బేలార్ యంత్రాలు వెంటనే మంజూరు చేస్తున్నట్లు మంత్రి సభలో వెల్లడించారు. కార్యక్రమంలో మంత్రి ఈటల, ప్రభుత్వ విప్ సుధాకర్‌రెడ్డి, ఎంపీ వినోద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..మంత్రికి గొర్రె పిల్లను బహూకరిస్తున్న గొల్ల, కురుమలు