తెలంగాణ

ప్రతి ఇంటికీ మంచి నీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచిర్యాల: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మిషన్ భగీరథ పనులను పూర్తి చేసి, నెలాఖరు లోగా ప్రతి ఇంటికీ మంచి నీరు అందించాలని ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక అధికారి స్మితా సబర్వాల్ అన్నారు. శనివారం మంచిర్యాల జిల్లాలోని హాజీపూర్ మండలం ఎల్లంపల్లి ప్రాజెక్ట్ వద్ద 95 ఎంఎల్‌డీ వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ను శనివారం ఆమె, జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్‌తో కలిసి పరిశీలించారు. ఫ్లాంట్‌లోని 12వ ఫిల్టర్ బెడ్‌ల విభాగాలను పరిశీలించి ఎల్‌ఎండీ వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌లలో ఆపరేటర్ లేకుండా ఆటో డిజక్షన్ ద్వారా నడిచే విధానం చాలా బాగుందని అన్నారు. అన్ని ప్రాంతాలలో ఈ విధానం అమలు చేసి హైదరాబాద్‌కు అనుసందానం చేయాలని మిషన్ భగీరథ సీఈని అదేశించారు. వర్షా కాలంలో పనులకు ఎలాంటి అటంకాలు కలుగకుండా మూడు బదిలీల్లో సిబ్బందిని సిద్ధం చేసుకోవడంతో పాటు సంఖ్యను పెంచి నిరంతరాయంగా పనులు కొనసాగేలా చూడాలన్నారు. జిల్లాలోని లక్ష్యాలను అధిగమించి 678 గ్రామాలలోని ఆవాసాలకు మంచి నీరు అందించాలని అధికారులకు సూచించారు. ఈ నెలాఖరు లోగా 26 పంపింగ్ సెట్లలో మోటర్‌లు బిగించి నిరంతరంగా నీరు అందించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం అధికారులకు పలు సూచనలు సలహాలు చేయడంతో పాటు చెన్నూర్, నియోజక వర్గానికి వెళ్లే తోళ్ల వాగు, తీగల్ పహాడ్, శ్రీరాంపూర్ కాలువల వద్ద మిషన్ భగీరథ పైప్‌ల నిర్మాణంలో పైపుల నాళా కన్వర్షన్ , రీవర్ కన్వర్షన్ల వద్ద వంతెన నిర్మాణాలను సాధ్యమైన్నంత త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ వై సురేందర్ రావు, రాజస్వ మండల అధికారి శ్రీనివాస్, ఈ ఎస్ ఈ కృపాకర్ రెడ్డి, ఛీఫ్ ఇంజనీర్ జగన్మోహాన్, ఎస్ ఈ జ్ఞాన్ కుమార్, సంబంధిత మిషన్ భగీరథ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

చిత్రం..ఫిల్టర్ బెడ్ల విభాగాలను పరిశీలిస్తున్న సీఎం కార్యాలయ ప్రత్యేక అధికారి స్మితా సబర్వాల్