తెలంగాణ

ప్రతి పాఠశాల, కళాశాలకూ దక్కన్ క్రానికల్ పత్రిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొల్లాపూర్, ఆగస్టు 11: నాగర్‌కర్నూల్ జిల్లా, కొల్లాపూర్ నియోజకవర్గంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మొదలుకుని పీజీ కళాశాలలో చదవుకుంటున్న విద్యార్థులలో ఆంగ్ల ప్రావీణ్యం పెంపొందించేందుకు తన సొంత ఖర్చుతో దక్కన్ క్రానికల్ దినపత్రికలను పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. శనివారం పట్టణంలోని పలు ప్రధాన రహదారులను ఆయన పరిశీలించారు. ప్రధాన రహదారులను పరిశుభ్రంగా ఉంచాలని కమిషనర్‌ను ఆయన ఆదేశించారు. ఈ సందర్భంగా విలేఖరులతో మాట్లాడుతూ గతంలో వివిధ ఉద్యోగాలకోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కోచింగ్ ఇచ్చామన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతి కార్యకర్త రోజుకో గంట శ్రమించి మొక్కలు నాటడం, రహదారులు, ప్రధాన వీధులలో పరిశుభ్రం చేయడంలో శ్రమదానం చేయాల్సిందిగా ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి ద్విచక్ర వాహనంపై పలు రహదారుల వెంట ప్రయాణించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

చిత్రం..కొల్లాపూర్‌లో ద్విచక్ర వాహనంపై పర్యటిస్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావు