తెలంగాణ

కరవు ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 11: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు కొనసాగినంత కాలం రాష్ట్రంలో కరవు పరిస్థితులు తప్పవని వైఎస్‌ఆర్ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణం కరవు ప్రాంతలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని ఆయన ముఖ్యమంత్రిని నిలదీశారు. ఈ యేడాది రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా కరవు దాపురించిందని వీటికి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవడంలో ముఖ్యమంత్రి విఫలం చెందారని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో 336 మండలాల్లో కరవు పరిస్థితులు ఉంటే కేవలం 275 కరవు మండలాలు ప్రకటించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. కరువును పారద్రోలడానికి రేయిన్‌గన్స్ తీసుకువస్తామని ముఖ్యమంత్రి చెప్పారని, మరి ఇప్పుడు కరువు ప్రాంతాల్లో ఏమేరకు రేయిన్‌గన్స్ ఏర్పాటు చేశారో వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర నెంబర్‌వన్ వ్యవసాయంలోనా? లేక నెంబర్ కరవులోనా సిఎం ప్రజలకు చెప్పాలన్నారు.