తెలంగాణ

రైతుల కష్టాలు పట్టని ప్రభుత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 11: రైతాంగం తీవ్ర కష్టాల్లో ఉంటే తెలంగాణ ప్రభుత్వానికి పట్టింపే లేదని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ ఆరోపించారు. శనివారం నాడు ఆయన పార్టీ కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడుతూ 326 మండలాల్లో రైతులు పత్తి, మొక్కజొన్న పంటలకు వర్షాభావం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం నాలుగేళ్ల పాలనలో ఎన్నో వేల కోట్లు ఖర్చు పెట్టినా రైతులకు నీరు అందలేదని, ప్రాజెక్టులు అవినీతి మయంగా మారాయని, సొంతలాభం కోసం టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టుల వ్యయాన్ని పెంచిందని ఆరోపించారు. మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్‌బీమా యోజన పథకం తెలంగాణలో అమలుచేయడంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. రైతులకు మోడీ ప్రభుత్వం బోనస్ ఇస్తున్నా దానికి అదనంగా వరికి 500 రూపాయిలు, పత్తికి 1500 రూపాయిలు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు చారిత్రాత్మక విజయాలను సాధించాయని, ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా ఫలించలేదని అన్నారు. 21 బిల్లును సమావేశాల్లోవ ఆమోదం పొందాయని, ఓబీసీ బిల్లు కూడా ఆమోదం పొందిందని అన్నారు. ఎస్సీ, ఎస్టీ బిల్లు కూడా ఆమోదం పొందిందని, అవిశ్వాస తీర్మానం వీగిపోయిందని, మోడీ ప్రభుత్వాన్ని ఏదో రీతిన అప్రతిష్టపాల్చేయాలని చూసి అంతా విఫలమయ్యారని అన్నారు. ఆర్ధిక నేరాలను అరికట్టేందుకు సైతం బిల్లును తెచ్చారని, రాహుల్‌గాంధీలో కుర్రతనమే తప్ప రాజకీయ పరిపక్వత లేదని ఆరోపించారు. కాంగ్రెస్ , ఇతర పార్టీలు ముస్లింలకు ఎపుడూ న్యాయం చేస్తూ వచ్చాయని, బీసీ బిల్లు, ఎస్సీ- ఎస్టీ బిల్లులు ఆమోదం పొందిన సందర్భంగా వారం రోజుల పాటు సామాజిక సంపర్క్‌పర్వ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని అన్నారు. టీఆర్‌ఎస్ ఫ్లైఓవర్లకు రక్షణ శాఖ భూములు ఇవ్వడం లేదని అసత్యప్రచారం చేస్తోందని, కానీ వాస్తవానికి కేంద్రం సానుకూలంగానే ఉందన్నారు. బైసన్‌పోల్, జింఖానా గ్రౌండ్‌ను సెక్రటేరియట్‌కు ఇవ్వడం సబబు కాదనీ క్రీడాకారులు కోర్టును ఆశ్రయించారని చెప్పారు.
కాంగ్రెస్‌కు టీడీపీ తాకట్టు
కాంగ్రెస్ పార్టీకి టీడీపీని చంద్రబాబునాయుడు తాకట్టు పెట్టారని బీజేపీ ఉపాధ్యక్షురాలు డి.కవిత ఆరోపించారు. శనివారం నాడు ఆమె పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడుతూ నరేంద్రమోదీ కంటే తాను సీనియర్‌నని పదే పదే చెప్పే చంద్రబాబు 23 జిల్లాల నుండి 13 జిల్లాలకు ముఖ్యమంత్రి అయ్యారని, నరేంద్రమోదీ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి నుండి దేశ ప్రధాని అయ్యారని , సీనియార్టీ ఏం చేసుకోవాలని ప్రశ్నించారు. ఆనాడు టీడీపీలో సంక్షోభానికి, కాంగ్రెస్‌లో సంక్షోభానికి కారణమై కాంగ్రెస్‌తో పోరాడి, చివరికి మళ్లీ కాంగ్రెస్‌తోనే చంద్రబాబు చేతులు కలిపారని ఆరోపించారు.