తెలంగాణ

కాంట్రాక్టు లెక్చరర్లకు ఉద్యోగ భద్రత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 11: కాంట్రాక్టు లెక్చరర్ల ఉద్యోగ భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శనివారం నాడు నిర్వహించిన కాంట్రాక్టు లెక్చరర్ల సదస్సుకు ఎమ్మెల్సీతో పాటు ప్రొఫెసర్ హరగోపాల్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా కాంట్రాక్టు లెక్చరర్ల సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు జీ రమణారెడ్డి, డాక్టర్ కొప్పిశెట్టి సురేష్ తమ డిమాండ్లను వివరించారు. కాంట్రాక్టు ఉద్యోగుల, లెక్చరర్ల క్రమబద్ధీకరణ విషయంలో హైకోర్టులో ఉన్న పెండింగ్ కేసులను సత్వరం పరిష్కరించేట్టు ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలని, అవసరమైతే యాక్టు చట్ట సవరణ చేయాలని అన్నారు. క్రమబద్ధీకరణ జరిగే వరకూ ఉద్యోగ భద్రత కల్పిస్తూ కాంట్రాక్టు లెక్చరర్లకు 12 నెలల వేతనం, హెచ్‌ఆర్‌ఏ, డిఏ చెల్లించాలని అన్నారు. ఆర్ధికంగా భారం కాని కాంట్రాక్టు లెక్చరర్ల బదిలీలకు అవకాశం కల్పించాలని, ప్రస్తుతం కాంట్రాక్టు లెక్చరర్లకు నెలకు ఒక రోజు మాత్రమే సెలవు ఇస్తున్నారని, ఇందుకు తోడు నెలకు అదనంగా మరో రోజు సెలవు పెంచాలని, మహిళా కాంట్రాక్టు లెక్చరర్లకు అదనంగా ఐదు రోజులు సెలవు ఇవ్వాలని కోరారు. మహిళా కాంట్రాక్టు లెక్చరర్లకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని, కాంట్రాక్టు లెక్చరర్ల కుటుంబాలకు ఆరోగ్యబీమా లేదా హెల్త్ ఇన్స్యూరెన్స్ కల్పించాలని, మరణించిన కాంట్రాక్టు లెక్చరర్ల కుటుంబాలకు ప్రభుత్వం ఆర్ధికంగా సాయం అందించాలని అన్నారు. వారి కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం లేదా ఉపాధి కల్పించాలని కోరారు. తమ సమస్యలపై ప్రభుత్వం ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని వారు కోరారు. అయితే కాంట్రాక్టు లెక్చరర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సత్వర పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి చెప్పారు.