తెలంగాణ

అతిథులను ఆదరించడమే మన సంస్కృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 11: అతిథులకు ఆతిథ్యం ఇవ్వడమే తెలంగాణ సంస్కృతి తప్ప బెదిరించడం, హెచ్చరికలు చేయడం, రానీయకపోవడం కాదని ఎఐసీసీ కార్యదర్శి, మాజీ ఎంపీ వి. హనుమంత రావు తెలిపారు. ఎఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా పర్యటన సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీనీ సందర్శించి విద్యార్థులతో సమావేశం కావాలనుకున్నారని ఆయన శనివారం విలేఖరుల సమావేశంలో చెప్పారు. అయితే రాహుల్‌ను రానీయమని టీఆర్‌ఎస్‌కు అనుబంధ విభాగమైన టీఆర్‌ఎస్‌వీ తెగేసి చెప్పగా, అందుకు అనుగుణంగా యూనివర్సిటీ అధికారులు కూడా అనుమతి నిరాకరించడం విస్మయం కలిగించిందన్నారు. శాంతి-్భద్రతల సమస్య తలెత్తుతుందని చిత్రీకరించడం హాస్యాస్పదమని ఆయన తెలిపారు. రాహుల్ విద్యార్థులతో సమావేశమైతే శాంతి-్భద్రతల సమస్య ఎందుకు వస్తుందన్నారు.
బైసన్ పోలోను కాపాడేందుకు నిరవధిక నిరాహార దీక్ష..
ప్రస్తుతం ఉన్న సచివాలయాన్ని సికింద్రాబాద్‌లోని బైసన్ పోలో గ్రౌండ్‌కు తరలించాలన్న ఆలోచనను విరమించుకోవాలని వీహెచ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరారు. బైసన్ పోలోను గ్రౌండ్‌ను కాపాడేందుకు తాను ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని ఆయన హెచ్చరించారు. వాస్తు పేరిట సచివాలయాన్ని బైసన్‌పోలో గ్రౌండ్‌కు తరలించరాదన్నారు. బైసన్ పోలో గ్రౌండ్‌లో సచివాలయం నిర్మిస్తే స్పోర్ట్స్ కోసం స్థలం ఉండదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయంపై తాను లోగడ చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణలో ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా 97.5 శాతం ఓట్లు వచ్చాయని ఆయన తెలిపారు. బైసన్ పోలో గ్రౌండ్‌పై తాను త్వరలో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తానని వీహెచ్ చెప్పారు.