తెలంగాణ

ప్రజల ఆకాంక్షలు నెరవేరాయా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 11: తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు ఏ మేరకు నెరవేరాయన్న విషయాలు తెలుసుకునేందుకే ఎఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాష్ట్రానికి వస్తున్నారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులతో రాహుల్ సమావేశం కావాలనుకుంటే వైస్-్ఛన్సలర్ అనుమతి నిరాకరించడం దారుణమని ఆయన శనివారం విలేఖరుల సమావేశంలో అన్నారు. ఉస్మానియా వర్సిటీ నిషిద్ధ ప్రాంతమా? అని ఆయన ప్రశ్నించారు. సమాజానికి దిశా నిర్ధేశం చేసే ప్రాంతమైన వర్సిటీలో నిషేదాజ్ఞలా? అని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన పార్టీ అధ్యక్షుడికి ఇచ్చే గౌరవం ఇదేనా? అని ఆయన ప్రశ్నించారు. మాజీ మంత్రి జే. గీతారెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ మహిళలను చిన్నచూపు చూస్తున్నారని విమర్శించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు మహిళల సంక్షేమానికి చేపట్టిన పథకాలను కేసీఆర్ నీరుగార్చారని ఆమె విమర్వించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అధికారంలోకి వస్తామని ఆమె ధీమాగా చెప్పారు.

చిత్రం..హైదరాబాద్‌లో శనివారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క. చిత్రంలో గీతారెడ్డి తదితరులు