తెలంగాణ

బీసీలకు సర్కార్ కానుక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, ఆగస్టు 12: నిన్నటి మొన్నటి దాకా అన్నదాతలకు అండగా నిలిచేందుకు వారికి పెట్టుబడి సాయంతోపాటు రైతుభీమా అమలు, మత్స్యకారులకు చేప పిల్లల పంపిణీతోపాటు రాయితీపై వాహనాలు, గొల్ల, కురుమలకు గొర్రెల పంపిణీ పథకాలు చేపట్టిన కేసీఆర్ సర్కార్ జనాభాలో అత్యధికంగా ఉండే వెనుకబడిన తరగతులకు రుణాల కానుకను అందించబోతోంది. పంద్రాగస్టు వేడుకలను పురస్కరించుకుని బీసీలకు, బీసీ సంఘాలకు రుణాలు ఇవ్వబోతోంది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ఆదివారం హైదరాబాద్‌లో ప్రకటించారు. ఈ పథకం కింద ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సుమారు 50 వేల మందికి లబ్ధి చేకూరే అవకాశాలున్నాయి. బీసీ కార్పోరేషన్, పెడరేషన్ల ద్వారా పెద్దఎత్తున రుణాలు అందించేందుకు నడుంబిగించిన ప్రభుత్వం ఆ మేరకు తగిన సన్నాహాలు చేసుకుంది. బ్యాంకులతో సంబంధం లేకుండా నేరుగా మూడు కేటగిరీల్లో రుణాలు అందించేందుకు కార్యాచరణ రూపొందించింది. ఇందులో 80శాతం సబ్సిడీతో రూ.లక్ష, 75శాతం సబ్సిడీతో రూ.2లక్షల రుణాలు ఇవ్వనుండగా, రూ.2లక్షలకు మించిన రుణాలను మాత్రం మూడవ కేటగిరీలో చేర్చి బ్యాంకులకు గ్యారంటీగా ఇచ్చి రుణాలు ఇచ్చేందుకు నిర్ణయించింది. అలాగే ఫెడరేషన్లకు కేటగిరి-1కింద రూ.లక్ష, కేటగిరి-2కింద రూ.2లక్షలు, కేటగిరి-3కింద రూ.2లక్షల నుంచి రూ.12లక్షల వరకు రుణాలు ఇవ్వనున్నారు. కరీంనగర్ జిల్లాలో 2017-18కిగాను మార్జిన్ మనీ (రూరల్) కింద 8,693, సావిత్రిబాపూలే అభ్యుదయ యోజన (అర్బన్) కింద 1,797 చొప్పున మొత్తం 10,490 యూనిట్లకు రుణాలు అందించనుంది. అలాగే 11బీసీ సంఘాలకు మొత్తం 10,077 యూనిట్లను పంపిణీ చేయనున్నారు. కరీంనగర్ జిల్లాలో మొత్తం 20,567 యూనిట్లు అందించనుండగా, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో సుమారు మరో 30వేల వరకు యూనిట్లు అందించే అవకాశాలున్నాయి. ఉమ్మడి జిల్లా మొత్తంగా 50వేల మందికి లబ్ది పొందనున్నారు. ఇప్పటికే ఈ రుణాలకు సంబంధించి లబ్ధిదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. పంద్రాగస్టు వేడుకలను పురస్కరించుకుని రైతు బీమా అమలు, కంటి వెలుగులు ప్రారంభానికి నిర్ణయించిన సర్కార్ అదేరోజు బీసీలకు రుణాలు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు హైదరాబాద్‌లో ఆదివారం వివిధ కుల సంఘాల ప్రతినిధులతో జరిగిన సమావేశానంతరం రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ పంద్రాగస్టున బీసీ రుణాలను అందించనున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ నిర్ణయం పట్ల బీసీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి మరో రెండ్రోజుల్లో బీసీల రుణాలు వారి దరిచేరనుండగా, రుణాల యూనిట్లను అందించేందుకు అధికార యంత్రాంగం సమాయత్తమవుతోంది.