తెలంగాణ

కొల్లూర్ భూ వివాదంలో ఆర్మీ హల్‌చల్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామచంద్రాపురం, ఆగస్టు 12: అది ఔటర్ రింగ్ రోడ్డుకు ఆనుకొని ఉన్న స్థలం.. ఆ స్థలం తమదంటే తమదంటూ రెండు వర్గాల మధ్య గత కొన్ని రోజులుగా వివాదం నడుస్తోంది. అయితే ఆదివారం ఒక్కసారిగా ఆ స్థలంలోకి ఆర్మీ బెటాలియన్‌లు దిగాయి. బందూకులు దరించిన కొంతమంది సైనికులు ఆ స్థలంలో పాగా వేశారు. ఉన్నట్టుండి దాదాపు 30 మంది ఆర్మీ జవాన్లు ఆయుధాలతో దిగిపోవడంతో స్థానికులంతా భయబ్రాంతులకు గురయ్యారు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కొల్లూర్‌లో ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్డు పక్కనే ఉన్న సర్వే నంబర్ 204లో కొంత భూమిపై 30 ఏళ్ల క్రితమే క్రయవిక్రయాలు జరిగాయి. అందులోని నాలుగెకరాల భూమిలో అప్పట్లో వెంఛర్ వేసి అమ్మకాలు జరిపారు. అ భూమికి తాను కొన్నానని రాజేష్‌జైన్ అనే వ్యక్తి ప్రస్తుతం కబ్జాలో ఉన్నారు. అయితే అందులో తమ ప్లాట్లు ఉన్నాయంటూ నెల రోజులుగా కొంతమంది వ్యక్తులు అక్కడ ఫెన్సింగ్ వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల వారికి వివాదం ప్రారంభమైంది. గత రెండు రోజుల క్రితం తమ ప్లాట్లు ఉన్నాయంటూ వచ్చిన వ్యక్తులు ఆ స్థలం వద్ద హంగామా చేశారు. ఆయుధాలతో అక్కడున్నవారిని బెదిరించి పంపించివేశారు. ఫెన్సింగ్‌లు వేయడానికి కడీలను కూడా తెప్పించారు. ఈ వివాదంపై రామచంద్రాపురం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదులు కూడా చేసుకున్నారు. రిజిస్టర్ డాక్యుమెంట్లను చూపించాలని పోలీసులు వారికి సూచించారు. దాని ప్రకారమే చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపిన నేపధ్యంలో ఆదివారం ఒక్కసారిగా 30 మంది సైనికులు ఆ స్థలంలో దిగి హల్‌ఛల్ చేశారు. కల్నల్, మేజర్ మొదలుకొని 12 మంది సైనికుల ప్లాట్లు అందులో ఉన్నాయని, కొంతమంది వాటిని కబ్జా చేశారంటూ హడావిడి చేశారు. దగ్గరుండి కొంతమేర ఫెన్సింగ్‌ను కూడా ఏర్పాటు చేశారు. తమ సొంత సొమ్ముతో ఈ ప్లాట్లను కొనుక్కున్నామని, ఆ స్థలం అసలు హక్కు మాకే ఉందంటూ బదులిచ్చారు. ఒక్కసారిగా ఆర్మీవారు ఆయుధాలతో అక్కడ దిగిపోవడంతో స్థానికులు నిశే్చతులయ్యారు. విషయం తెలుసుకున్న రామచంద్రాపురం ఎస్ ఐ నర్సింహారావు అక్కడికి చేరుకొని జవాన్లతో మాట్లాడారు. ఇక్కడ ఏదో జరిగిందని స్థానికులు బయపడుతున్నారని, ఏమైనా ఉంటే స్టేషన్‌కు వచ్చి ఉన్నతాధికారుతో మాట్లాడాలని సూచించారు. సొంత ప్లాట్ల విషయంలో ఇలా సైనికులు తుపాకులు, బెటాలియన్ వాహనాల్లో రావడం చర్చనీయాంశంగా మారింది. ఆయుధాలు అడ్డుపెట్టి ఫెన్సింగ్‌లు వేయించడం ఏమిటని, ఏ వివాదమున్నా సామరస్యకంగా చర్చించుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. రియల్ భూమ్ పెరగడం, కొల్లూర్‌లో భూములకు కోట్లలో రెక్కలు రావడంతోనే ఈ వివాదాలు చోటుచుసుకుంటున్నాయని పోలీసులు వాపోతున్నారు. వివాదం కేసుల వరకు వెళ్లడంతో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.

చిత్రం.. వివాదాస్పద స్థలం వద్ద బందూకులతో నిలబడిన ఆర్మీ జవాన్లు, సైనికాధికారులతో మాట్లాడుతున్న ఎస్‌ఐ