తెలంగాణ

తెలంగాణలో అప్రజాస్వామిక పాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సాపూర్, ఆగస్టు 12: రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన కొనసాగుతుందని భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ ఆరోపించారు. ఆదివారంనాడు మెదక్ జిల్లాలోని నియోజకవర్గ కేంద్రమైన నర్సాపూర్‌లో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక ఆనంద్‌గార్డెన్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి రఘువీరా రెడ్డి తన అనుచరులతో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో కొనసాగుతున్న అవినీతి పాలనకు చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. రాష్ట్రంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వం అబద్ధాల పునాదులపై నడుస్తోందని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రభుత్వంలో మొట్టమొదటగా దళితుడు ముఖ్యమంత్రి అవుతాడని, దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని చెప్పి మోసం చేశాడని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వంలో మహిళలకు అన్యాయం జరిగిందని ఒక్క మహిళా మంత్రి లేదని కేవలం కుటుంబ పాలన కొనసాగుతుందని అన్నారు. టీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు అన్ని పార్టీలు ఏకమయ్యే రోజులు వచ్చాయని అన్నారు. నర్సాపూర్ నియోజకవర్గంలోని టీడీపీ మొత్తం ఇన్‌చార్జి ఆధ్వర్యంలో బీజేపీలో విలీనం కావడం శుభ సూచకమని అన్నారు. అదేవిధంగా రాష్ట్రంలోని మిగతా నియోజకవర్గాలకు చెందిన టీడీపీ నాయకులు సైతం టీఆర్‌ఎస్‌ను అంతమొందించేందుకు తమతో కలిసిరావాలని పిలుపునిచ్చారు. ఆగస్టు 15నుంచి పల్లే పల్లేకు బీజేపీ కార్యక్రమంలో భాగంగా కేసీఆర్ అవినీతిని ఎండగట్టేందుకు యాత్ర చేపడ్తామని అన్నారు. తెలంగాణ వస్తే ఇంటింటికీ ఉద్యోగం అన్నాడు అది ఎక్కడపోయిందని ఆరోపించారు. బీసీలకు సబ్‌ప్లాన్ అని మోసం చేశాడని, కేజీ టూ పీజీ అన్నాడు.
రెండు లక్షల ఉద్యోగులను భర్తీ చేయడం లేదని ఆరోపించారు. కార్యక్రమంలో మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు విజయ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.నర్సాపూర్ టీడీపీ ఇన్‌చార్జి రఘువీరారెడ్డిని పార్టీలో
చేర్చుకుంటున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్