తెలంగాణ

సింగూర్‌పై వరుణుడి చిన్నచూపు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, ఆగస్టు 20: ఉత్తర, ఈశాన్య, దక్షిణ భారతాన్ని వణికిస్తూ పెను వరదలను సృష్టిస్తున్న వరుణుడు మంజీర (గరుడగంగ) నది పరీవాహక ప్రాంతంపై కరుణ చూపడం లేదు. మంజీరా నదిపై నిర్మించిన సింగూర్ ప్రాజెక్టులోకి వరద నీరు మచ్చుకైనా రావడం లేదు. దేశం, తెలంగాణ రాష్ట్రంలోని ప్రధాన జలాశయాలు జలకళను సంతరించుకోగా సింగూర్ ప్రాజెక్టు మాత్రం ఇంకా వెలవెలబోతోంది. పలు ప్రాంతాల్లో బీభత్సమైన వర్షాలు పడుతున్నా సింగూర్ ప్రాతం డెడ్ స్టోరేజీ నీటికే పరిమితమైంది. సోమవారం నాటికి సింగూర్ ప్రాజెక్టులో 7.5 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు సాగు నీటి పారుదల శాఖ డిప్యూటీ ఇంజనీర్ బాలగణేష్ పేర్కొన్నారు. మహారాష్టల్రోని బీడ్ జిల్లా బాలాఘాట్ కొండల్లో పుట్టి కర్నాటక మీదుగా తెలంగాణ రాష్ట్రంలో మంజీర నది ప్రవహిస్తోంది. ఈ నదిపై తాగు, సాగు నీటి అవసరాల నిమిత్తం అనేక ప్రాజెక్టులు నిర్మించారు. ప్రధానంగా కర్నాటక సరిహద్దుల్లోని నారింజ ప్రాజెక్టు, సింగూర్, మంజీర బ్యారేజ్, ఘన్‌పూర్ ఆనకట్ట, నిజామాబాద్ జిల్లాలో నిజాంసాగర్ ప్రాజెక్టులు ఈ నదిపై ఉన్నాయి. మహారాష్ట్ర, కర్నాటకలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నా మంజీర పరివాహక ప్రాంతంలో మాత్రం ముసురు వానకే పరిమితమైంది. మహారాష్టల్రోని బీడ్ జిల్లా, కర్నాటకలోని బీదర్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిస్తేకానీ మంజీర నది పరవళ్లు తొక్కే పరిస్థితి కనిపించడం లేదు. ఆది, సోమవారాల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలోని సిద్దిపేట, మెదక్, గజ్వేల్, దుబ్బాక, రామాయంపేట, నర్సాపూర్ తదితర ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. మంజీర నదికి ఎగువ ప్రాంతాలైన నారాయణఖేడ్, జహీరాబాద్, మనూర్, న్యాల్‌కల్, కోహీర్, ఝరాసంగం, మునిపల్లి, రంగారెడ్డిల్లో వరుణుడు ముసురుతోనే సరిపెట్టాడు. ఆయా మండలాల నుంచి వాగులు, వంకలు ప్రవహిస్తే మంజీరలోకి వరద నీరు వచ్చి చేరుతోంది. రంగారెడ్డి జిల్లా నుంచి తరలివచ్చే అతి పెద్ద వాగు నారింజలో కూడా ఏ మాత్రం వరద ప్రవాహం లేదు. ఆరుతడి పంటలకు తుంపర వాస్త కాస్తంత జీవ పోసిందని రైతులు సంతృప్తి పడుతున్నారు. ఈ యేడాది సాధారణ వర్షపాతం కన్నా తక్కువగా నమోదైంది. మంజీర నదిపై నిర్మించిన సింగూర్ ఎత్తిపోతల పథకం కాలువల ద్వారా సుమారు వంద చెరువులను నింపడం, కాలువల ద్వారా నేరుగా సాగునీరు సరపరా చేస్తుండటంతో సుమారు 50 వేల ఎకరాల ఆయకట్టులో వరి పంటను రైతులు సాగు చేస్తున్నారు.
ఘన్‌పూర్ ప్రాజెక్టు క్రింద పాపన్నపేట, కొల్చారం, మెదక్ మండలాల్లో 20 వేల ఎకరాలకుపైగా వరి సాగు అవుతోంది. ఇప్పటికే వరి నాట్లు పూర్తి కావాల్సి ఉండగా సింగూర్ నుంచి నీరు విడుదల కాకపోవడంతో అన్నదాతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఘన్‌పూర్ ప్రాజెక్టు పరిధిలో ఆరంభంలో కురిసిన వర్షాలకు నాట్లు వేసుకున్న రైతులను తీవ్ర మనోవేధనకు గురి చేస్తోంది. సింగూర్ నీటిని విడుదల చేయాలని మెదక్ ప్రాంతానికి చెందిన రైతులు ఆందోళన బాట పట్టిన విషయం తెలిసిందే. బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొనడంతో రైతుల్లో ఆశలు సజీవమవుతున్నాయి.