తెలంగాణ

నిట్ యూనివర్శిటీ చైర్మన్‌గా బిట్స్ పిలానీ విసి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 28: బిట్స్ పిలానీ వైస్ ఛాన్సలర్‌గా పనిచేస్తున్న ప్రొఫెసర్ విఎస్.రావు కొత్తగా ఏర్పాటు చేసిన నిట్ యూనివర్శిటీ (ఎన్‌యు) చైర్మన్‌గా చేరనున్నారు. సంస్థాగత నిర్మాణంలో మూడు దశాబ్దాలకు పైగా ఎంతో నైపుణ్యం, అపారమైన అనుభవం ఉన్న ప్రొఫెసర్ రావు నిట్ యూనివర్శిటీని పటిష్టమైన విద్యా సంస్థగా తీర్చిదిద్దుతానని ప్రకటించారు. ఈ సందర్భంగా నిట్ యూనివర్శిటీ చైర్మన్ రాజేంద్ర ఎస్ పవార్ మాట్లాడుతూ, సృజనాత్మక ఆలోచనలను అమలు చేయడంలో డాక్టర్ రావుకు గల అపారమైన అనుభవం తమకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఎన్‌యులో తాను నిర్వహించబోయే పాత్ర గురించి ప్రొఫెసర్ రావు ఉత్సాహంగా చెబుతూ, పరిశోధనా రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తానని స్పష్టం చేశారు.