తెలంగాణ

ఉద్ధృతమవుతున్న జిల్లా సాధన ఉద్యమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జనగామ టౌన్, మే 28: జనగామ జిల్లా సాధన ఉద్యమం రోజురోజుకు తీవ్రరూపం దాల్చుతుంది. గత కొన్ని రోజులుగా రోజుకో రూపంలో నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్న ఉద్యమకారులు శనివారం మండలి చైర్మన్ స్వామిగౌడ్, భువనగిరి ఎంపి బూర నర్సయ్య గౌడ్‌లను జనగామ చౌరస్తాలో అడ్డుకున్నారు. జిల్లా సాధన జెఎసి ఆధ్వర్యంలో స్థానిక చౌరస్తాలో ఉద్యమకారులు అర్థనగ్న ప్రదర్శన నిర్వహిస్తుండగా అదే సమయంలో ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు జనగామ మండలానికి వస్తున్న మండలి చైర్మన్ స్వామిగౌడ్, ఎంపి బూర నర్సయ్యగౌడ్‌లను అడ్డుకున్నారు. వారి వాహనాల ముందు ప్లకార్డులతో నినాదాలు చేస్తూ ముందుకు వెళ్లకుండా నిలిపివేయడంతో వారు ఆందోళనకారుల వద్దకు దిగివచ్చి మాట్లాడే ప్రయత్నం చేశారు. వారు చెప్పే మాటలను వినిపించుకోకుండా ఉద్యమకారులు జనగామ జిల్లాను ప్రకటించడంలో ప్రభుత్వం పక్షపాత ధోరణి అవలంభిస్తుందని ఆరోపిస్తూ వారితో వాగ్వివాదం చేశారు. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా జిల్లా ప్రకటించి జనగామ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు సహకరించాలని డిమాండ్ చేశారు. అనంతరం మండలి చైర్మన్ స్వామిగౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వం శాస్ర్తియ పద్ధతిలో జిల్లాలను ఏర్పాటు చేయబోతుందని, అందుకు కొంత వేచిచూడాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లారు. ఈ కార్యక్రమంలో జిల్లా సాధన సమితి కన్వీనర్ మంగళంపల్లి రాజు, జిల్లా సాధన ఉద్యమ జెఎసి పట్టణ కన్వీనర్ ఆకుల సతీష్, ప్రతినిధులు ధర్మపురి శ్రీనివాస్, జక్కుల వేణుమాధవ్, రత్నాకర్‌రెడ్డి, మణి, కాసుల శ్రీనివాస్, జగదీష్, కృష్ణలు పాల్గొన్నారు.

chitram ఉద్యమకారులను సముదాయిస్తున్న మండలి చైర్మన్, ఎంపిలు