తెలంగాణ

టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 4: తెలంగాణలో శాసనసభకు ఎన్నికల ఎప్పుడు జరిగిన తాము సిద్ధంగా ఉన్నామని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావువెల్లడించారు. ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యలయంలో మంగళవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ తెలంగాణలోముందస్తు ఎన్నికలకు తాము సిద్ధమేనని అన్నారు. గత నాలుగేళ్ల కాలంలో తెలంగాణలోని అన్ని జిల్లాల్లో పార్టీని బూత్ స్థాయి నుంచి బలోపేతం చేశామన్నారు. టీఆర్‌ఎస్ సెప్టెంబర్ 2 నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమైన వాగ్దానాలపై మాట్లాడకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని అన్నారు. నాలుగేళ్ల టీఆర్‌ఎస్ ప్రజావ్యతిరేక పాలనపై బీజేపీ ‘్ఛర్జ్‌షీట్’యాత్రలు చేయనుందని ఆయన వెల్లడించారు. టీఆర్‌ఎస్‌కు వ్యతిరేంకంగా పోరాడేందుకు తెలంగాణలో సిద్ధంగా ఉండాలని జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా గ్రీన్ పిలుపునిచ్చారని ఆయన అన్నారు. తెలంగాణలో జరగబోయే బహిరంగ సభల్లో అమిత్‌షా పాల్గొంటారని చెప్పారు.