తెలంగాణ

దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వాల కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామారెడ్డి, సెప్టెంబర్ 4: దివ్యాంగుల సంక్షేమ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విశేష కృషి చేస్తున్నాయని, కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయ, సాధికారికత శాఖ మంత్రి రాందాస్ అథవాలే అన్నారు. ఆయన మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సత్యగార్డెన్స్‌లో దివ్యాంగులకు సహాయ పరికరాలను అందించే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజల్వన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ, డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాలతో నిర్మితమైన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రతినిధిగా కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయ, ఎంపవర్‌మెంట్ శాఖ మంత్రిగా తాను దివ్యాంగులకు 2011 జనాభా లెక్కల ప్రకారం 2కోట్ల 67 లక్షల 557మంది దివ్యాంగులకు, 7వేల క్యాంప్‌ల ద్వారా వివిధ రకాల సహాయ పరికరాలను అందించామన్నారు. దివ్యాంగులకు ఉద్యోగాలల్లో తప్పనిసరిగా నాలుగు శాతం రిజర్వేషన్ పాటించే విధంగా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. దివ్యాంగులు ఏషియన్, వరల్డ్ కప్‌లల్లో గెలుపొందిన విషయాన్ని గుర్తు చేశారు. దివ్యాంగులు వీల్ చైర్‌లలో క్రికెట్ మ్యాచ్‌ల్లో ముందుంటున్నారన్నారు. త్వరలో ముంబై ట్రోఫీలో పాల్గొంటారన్నారు. దివ్యాంగులు మనస్సుతో అన్ని రంగాల్లో విజయం సాధిస్తున్నారన్నారు. ప్రధానమంత్రి సబ్‌కా సాత్ సబ్‌కా వికాస్ అనే నినాదంతో ప్రజలల్లోకి వెళ్తున్నారని అన్నారు. ఆర్టిఫీషియల్ లింబ్స్ కెంపీసీ లిమిటెడ్ ద్వారా కృత్రిమ సహాయ పరికరాలను దివ్యాంగులకు అందిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా 669 దివ్యాంగులకు 43 లక్షల విలువైన పరికరాలను అందించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా హాజరై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ, ప్రతి నెలా దివ్యాంగులకు ఒక లక్షా 846 మందికి 1500ల చొప్పున ప్రతి నెలా రెండు కోట్ల 81 లక్షల ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రీమెట్రిక్ 78 దివ్యాంగులకు 79 వేలు, పోస్ట్ మెట్రిక్ ద్వారా పీజు రీయంబర్స్‌మెంట్, స్వయం ఉపాధి ద్వారా 50 వేల వరకు వంద శాతం సబ్సిడీ లక్ష వరకు 80 వేల సబ్సిడీ రెండు లక్షలకు, లక్షా నలభై వేల సబ్సిడీతో పాటు వివాహ ప్రోత్సాహకాలు అందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు బీబీపాటిల్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగులకు 500ల పింఛన్‌ను వివాహ ప్రోత్సాకాలను, పది కోట్లతో వికలాంగుల కార్పొరేషన్ నెలకోల్పిందన్నారు. 500 మంది దివ్యాంగుల నిరుద్యోగులకు ఉచిత కోచింగ్ అందిస్తున్నట్లు వెల్లడించారు త్వరలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి 30, 70 శాతం సబ్సిడిలతో స్కూటర్‌లను పంపిణీ చేస్తామన్నారు. మూడు కోట్ల రూపాయలతో ట్రై సైకిళ్లు, సెల్‌ఫోన్‌లు, ఇతర వస్తువులను దివ్యాంగులకు అందిస్తున్నామన్నారు. దివ్యాంగులకు ఇళ్లు మంజూరుకు త్వరలో చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకు, రైతులకు, మహిళలకు, బడుగు బలహీన వర్గాల వారికి అనేక సంక్షేమ పథకాలుచేపట్టి చేయూతనందిస్తున్నారని అన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్. సత్యనారాయణ మాట్లాడతూ, జిల్లాలో దివ్యాంగుల కోసం అందిస్తున్న పథకాల వివరాలను వివరించారు. దివ్యాంగులకు కోరకు గత జూన్ మాసంలో స్పెషల్ క్యాంప్‌లను నిర్వహించి 669 మంది లబ్ధిదారులను గుర్తించడం జరిగిందని, వీరికి 44 లక్షల 50 వేలతో2617 సహాయ పరికరాలను వర్తింపజేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ దఫేదార్ రాజు, పుడ్ కమిషన్ చైర్మన్ తీర్మల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..దివ్యాంగులకు పరికాలను పంపిణీ చేస్తున్న కేంద్ర మంత్రి రాందాస్ అథవలే