తెలంగాణ

రక్షణ ఒప్పందాన్ని మోదీ ఉల్లంఘించారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 4: భారతదేశ రక్షణ ఒప్పందాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉల్లంఘించారని రాజ్యసభ సభ్యుడు, ఏఐసీసీ అధికార ప్రతినిధి నాసర్‌హుస్సేన్ ఆరోపించారు. మంగళవారం ఆయన మహబూబ్‌నగర్ పర్యటనకు విచ్చేశారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమవేశంలో నాసర్‌హుస్సేన్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర రక్షణశాఖ మంత్రి నిర్మలాసీతారామన్, ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీలు దేశ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని యుద్ధవిమానాల కొనుగోలు విషయాలను దేశ ప్రజలకు వివరించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తే పార్లమెంట్ సాక్షిగా అత్యున్నత పదవుల్లో ఉన్న వ్యక్తులు అబద్దాలు చెప్పారని ధ్వజమెత్తారు. రాఫెల్ స్కాం అతిపెద్ద కుంభకోణమని ఇందులో బీజేపీ వాటా ఉందని ఆరోపించారు. యుద్ధవిమానాల కొనుగోలులో భారీగా ముడుపులు చేతులు మారాయని రూ.520 కోట్ల విమానాలను రూ.1670 కోట్లకు కొనుగోలు చేశారని ఆరోపించారు. దాంతో రూ.41145 కోట్ల ప్రజాధనాన్ని ప్రధానమంత్రి దుర్వినియోగానికి పాల్పడ్డారని విమర్శించారు. 2012 డిసెంబర్ 12వ తేదీన గత యూపీఏ ప్రభుత్వ హయాంలో 126 యుద్ధ విమానాలు కేవలం రూ.526.10 కోట్లకు మాత్రమే కొనుగోలు చేసేందుకు అంతర్జాతీయ బిడ్ దాఖలు చేశారని తెలిపారు. దాంతో 18 యుద్ధ విమానాలు వినియోగంలోకి విచ్చేయగా మరో 108 విమానాలు ఇండియాలోనే తయారు చేసుకునేందుకు రాఫెల్ మొక్క టెక్నాలజీని వినియోగించుకునేలా హిందూస్తాన్ ఏరోనాటిక్స్‌తో అండర్ టేకింగ్ ఒప్పందం జరిగిందని ఆయన తెలిపారు. ఈ లెక్కన 36 యుద్ధ విమానాల ధర కేవలం రూ. 18940 కోట్లు మాత్రమేనని అన్నారు. కానీ 2015 ఏప్రిల్ 10వ తేదీన పారిస్ పర్యటన నిమిత్తం ఫ్రాన్స్ దేశానికి వెళ్లిన ప్రధాని మోదీ అకస్మాత్తుగా 36 యుద్ధ విమానాలను 7.5 బిలియన్ యూరోల ధరతో ఒక్కో యుద్ధవిమానాన్ని ఏకంగా రూ. 1670.70 కోట్లతో కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించారని ఆరోపించారు. దాంతో 36 యుద్ధవిమానాల ధర రూ. 60145 కోట్లుగా మారిందని తెలిపారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు కోసం అధనంగా రూ.41145 కోట్లు ఎందుకు ఖర్చు చేస్తున్నారో దేశ ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్‌లో ఈ విషయంపై కేంద్ర రక్షణమంత్రి నిర్మలాసీతారామన్‌ను నిలదీస్తే ఆమే తప్పుడు సమాదానం చెప్పారని ఆమె చెప్పినవన్ని అబద్దాలని ఆరోపించారు. అందుకే తాము రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలులో భారీ స్కాం జరిగిందని చెబుతున్నామని ఒకవేళ కుంభకోణం జరగలేదనుకుంటే ప్రధానమంత్రిగానీ రక్షణమంత్రిగానీ లెక్కలు దేశ ప్రజల ముందు ఎందుకు ఉంచడంలేదని ప్రశ్నించారు. రూ.41145 కోట్ల ప్రజాధనాన్ని ఎన్నికల కోసం బీజేపీకి మోదీ అప్పగించారని ఆరోపించారు. దేశంలో అన్ని జిల్లాలో బీజేపీ కార్యాలయాలు పెద్దఎత్తున నిర్మాణాలు జరిగాయని అందుకుగాను వాటికి డబ్బు ఎక్కడి నుండి వచ్చిందో అమిషా చెప్పాలని డిమాండ్ చేశారు. భారత్, ఫ్రాన్స్ మధ్య జరిగిన రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో ఎలాంటి దాపరికాలు లేవన్నప్పుడు ప్రధానమంత్రి మోదీ, రక్షణమంత్రి ఎందుకు 36 యుద్ధవిమానాల ధరలు పెంచాల్సి వచ్చిందో దేశ ప్రజల ముందు ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు. గత యూపీఏ ప్రభుత్వ హయాంలో తీసుకువచ్చిన ఒప్పందాలనే పునరుద్ధరణ చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై పార్లమెంట్‌లోపల, బయట కాంగ్రెస్ దేశ వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తుందని రాఫెల్ స్కాంపై బీజేపీని ప్రజల ముందు దోషిగా నిలబెడుతామని నాసర్‌హుస్సేన్ హెచ్చరించారు. దేశంలో బీజేపీకి ఎదురుగాలీ విస్తుందని కాంగ్రెస్‌కు మంచిరోజులు వచ్చాయని మోదీ పాలనలో దేశంలో కొన్ని వర్గాలు భయంతో బతుకుతున్నారని తమ రక్షణ కోసం వారంతా కాంగ్రెస్ అండగా నిలబడుతున్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ప్రజల మద్దతుతో అధికారంలోకి రావడం ఖాయమని రాహుల్‌గాంధీని ప్రధానమంత్రిగా ప్రజలు చూడాలనుకుంటున్నారని తెలిపారు. విలేఖరుల సమావేశంలో పీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఉబెదుల్లా కొత్వాల్, మాజీ మంత్రి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న రాజ్యసభ సభ్యుడు నాసర్‌హుస్సేన్