తెలంగాణ

మా ఊరికి రాకండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోరుట్ల రూరల్, సెప్టెంబర్ 4: జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం కల్లూర్ గ్రామానికి తీరని అన్యాయం చేసే కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు మా ఊరికి రావద్దంటూ గ్రామస్థులు రోడ్డుపై బైఠాయించి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. మంగళవారం ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు తమ ఊరికి తీరని అన్యాయం చేస్తున్న ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డెక్కారు. ఆందోళన చేస్తున్న కల్లూర్ గ్రామస్థులు విలేఖరులతో మాట్లాడుతూ ఎమ్మెల్యేగా గెలిచిన నాలుగేళ్లలో కల్లూర్ గ్రామ అభివృద్ధినే విస్మరించి తీరని అన్యాయం చేసి తమ ఊరు వచ్చే అర్హతలేదని కోల్పోయారన్నారు. నాలుగేళ్లలో తమ గ్రామానికి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని, దళితుల వాడల్లో కనీసం మురికి కాలువలు, సీసీ రోడ్లు నిర్మించలేదని, గ్రామ పంచాయతీ నూతన భవన నిర్మాణం పునాదులకే పరిమితమైనా పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకుంఠదామం నిర్మాణాలు వైకుంఠానికే ముట్టాయని, మరుగుదొడ్ల నిర్మించుకున్న లబ్ధిదారులకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా అదనంగా ఒక్కొక్కరి నుంచి రూ. 4వేలు వసూలు చేశారని, అధికారులకు, ఎమ్మెల్యేకు విన్నవించినా ఫలితం లేకపోతేనే విధిలేని పరిస్థితుల్లో ఆందోళన చేపట్టాల్సి వచ్చిందన్నారు. ఎంపీడీఓ మాదాపూర్ గ్రామ అభివృద్ధి అధికారిగా మాత్రమే పని చేస్తున్నారని, తమ గ్రామస్థులు ఏ విన్నపం చేసినా అది చెత్తబుట్టకే పరిమితం చేస్తున్నారని ఆరోపించారు. డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాల్లో సైతం కల్లూర్ గ్రామానికి తీరని అన్యాయం చేస్తూ కనీసం ఒక ఇల్లు మంజూరు చేయకపోవడం దారుణమని వాపోయారు. ఇకనైనా ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు మేల్కోని తమ కల్లూర్ గ్రామానికి న్యాయం చేసే వరకు తమ గ్రామానికి రావొద్దని హెచ్చరించారు. ఈ ధర్నాలో మహిళలు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.

చిత్రం.. ధర్నా చేస్తున్న కల్లూర్ గ్రామస్థులు