తెలంగాణ

పాలమూరు నుంచే బీజేపీ ఎన్నికల శంఖారావం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, సెస్టెంబర్ 4: పాలమూరు నుండే బీజేపీ ఎన్నికల శంఖారావం పూరించనుందని దాంతో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలను తప్పకుండా శాసించి తీరుతామని అందుకుగాను తమ ఎన్నికల ప్రణాళికలు తమకు ఉన్నాయని బీజేపీ శాసనసభాపక్షనేత కిషన్‌రెడ్డి వెల్లడించారు. ఈ నెల 12, లేదా 15న మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు రాష్ట్ర బీజేపీ నేతలు సన్నాహాలు మొదలుపెట్టారు. ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా హాజరుకానున్న నేపథ్యంలో సభను విజయవంతం చేసేందుకు బీజేపీ నేతలు రంగంలోకి దిగారు. అందులో భాగంగా మంగళవారం మహబూబ్‌నగర్‌లోని ఎంవీఎస్ డిగ్రీ కళాశాల మైదానాన్ని పరిశీలించిన అనంతరం కిషన్‌రెడ్డి పార్టీ కార్యాలయంలో నల్గొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి, జోగులాంబ గద్వాల, నాగర్‌కర్నూల్ జిల్లాల పార్టీ అధ్యక్షులు ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో బీజేపీ శాసనసభాపక్ష నేత కిషన్‌రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ప్రభుత్వాన్ని రద్దు చేసుకుని ముందస్తు ఎన్నికలకు వెళ్లిన డిసెంబర్‌లోనే ఎన్నికలు వచ్చినా ఒకవేళ కేసీఆర్ వెనకంజ వేసి భయపడితే వచ్చే సంవత్సరం ఏప్రిల్‌లో ఎన్నికలు వచ్చినా ఎన్నికలకు బీజేపీ ఎప్పుడైనా సిద్ధంగా ఉంటుందని తెలిపారు. అయితే, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల దృష్ట్యా తాము మాత్రం పాలమూరు జిల్లా నుండే ఎన్నికల శంఖారావం పూరించాలని నిర్ణయించుకున్నామని అందులో భాగంగా ఈ నెల 12న లేదా 15న భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నామని ఆయన వెల్లడించారు. ఈ సభకు జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా హాజరుకానున్నారని తెలిపారు. పాలమూరు పట్టణంలోని ఎంవీఎస్ డిగ్రీ కళాశాల మైదానంలో ఈ సభను ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. ఈ సభ ద్వారా రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ శక్తి ఏమిటో తెలుస్తుందని ఎప్పుడు ఎన్నికలు జరిగినా రాష్ట్రంలో మంచి ఫలితాలను సాధించి రాష్ట్ర రాజకీయాలను మాత్రం బీజేపీ శాసిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పాలమూరు నుండే ఎన్నికల శంఖారావం పూరించి తాము ఇక ఎన్నికల ప్రణాళికలో ఉంటామని తెలిపారు. బీజేపీ వెనకబడి ఉందని టీఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకులు అనుకుంటున్నారని ఉత్తరప్రదేశ్, త్రిపుర, అస్సాం రాష్ట్రాలలో బీజేపీ అధికారంలోకి రానేరాదని సర్వేలు కూడా వ్యతిరేకంగా వచ్చాయని తెలిపారు. కానీ అమిత్‌షా దిశా నిర్దేశంతో అక్కడ అధికారం చేపట్టామని కర్ణాటకలో కూడా 70 స్థానాలు మాత్రమే వస్తాయని అనుకున్నారని కానీ 104 స్థానాలు సాధించామని తమ వ్యూహం తమకు ఉందని అన్నారు. బీజేపీ ఆటను పాలమూరు నుండే ప్రారంభిస్తామని వెల్లడించారు. ఈ ఎన్నికల్లో మాత్రం ముస్లింల 12 వాతం రిజర్వేషన్లను వ్యతిరేకించే వారందని బీజేపీ దగ్గరకు చేర్చుకుంటుందని తెలిపారు. అటు కాంగ్రెస్, ఇటు టీఆర్‌ఎస్‌లను వ్యతిరేకించేవారందరితో తాము టచ్‌లో ఉంటామని తెలిపారు. ముందస్తు ఎన్నికలు అంటూ వస్తే రాష్ట్రంలో బీజేపీ నెత్తిన పాలుపోసిన్నట్లేనని కిషన్‌రెడ్డి వెల్లడించారు. ఈ దఫా ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక కూడా అంతా ఆశామాషీగా ఉండదని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఓ కమిటీ వేసి అందులో చర్చించాకే అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో అధికారాన్ని చేజిక్కించుకోనేందుకే తమ వ్యూహం ఉంటుందని తెలిపారు. ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలకు ఓ రాజకీయ సందేశాన్ని మాత్రం ఇస్తామని తెలిపారు. ఎంఐఎం ఆదేశాలతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తుకు సిద్దమయ్యారని ఆరోపించారు. ఈ సభను విజయవంతం చేసి బీజేపీని దీవించాలని పాలమూరు జిల్లా ప్రజలను తాము కోరుతున్నామని కిషన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ నిర్వహించిన ప్రగతి నివేదన సభ ఓ ఫ్లాప్‌షోలాంటిదని ఆ సభ గురించి ప్రజలే తిరస్కరించారని ఎధ్దేవా చేశారు. విలేఖరుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆచారి, కోశాధికారి శాంతికుమార్, ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. మహబూబ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో
మాట్లాడుతున్న బీజేపీ శాసనసభాపక్ష నేత కిషన్‌రెడ్డి