తెలంగాణ

పారిశ్రామికాభివృద్ధికి వౌలిక వసతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, సెప్టెంబర్ 4: పరిశ్రమల ఏర్పాటుకు విద్యుత్, నీరు, రైల్వేలైన్, మంచి రహదారులు అవసరమని సీఎం కేసీఆర్ కృషితోనే సిద్దిపేట జిల్లాలో అన్ని వసతులు సమకూర్చుకున్నట్లు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు వెల్లడించారు. సిద్దిపేట జిల్లా మందపల్లి శివారులో మలేసియాకు చెందిన డీఎక్స్‌ఎన్ కంపెనీ 50 ఎకరాల్లో 175 కోట్లతో నిర్మిస్తున్న సమీకృత వ్యవసాయ ఆధారిత పరిశ్రమకు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు, డీఎక్స్‌ఎన్ ప్రతినిధి లీన్, టీఎస్‌ఐఐసీ చైర్మన్ బాలమల్లు, ఎండీ నర్సింహరెడ్డితో శంకుస్థాపన చేశారు. ఆనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ సిద్దిపేటలో కొనే్నళ్లుగా అనుకున్న అన్ని పనులు చేసుకున్నా.. పరిశ్రమల ఏర్పాటులో కొంత ఆలస్యమయిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులు 90 శాతం పూర్తయినాయని, కొద్ది నెలల్లోనే కాల్వల ద్వారా పంటలకు సాగునీరు అందించనున్నట్లు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 16 టీఎంసీల నీరు పరిశ్రమలకు కేటాయించినట్లు మంత్రి హరీష్‌రావు వెల్లడించారు. వ్యవసాయం, గృహ అవసరాలు, పరిశ్రమలకు 24 గంటలు కరెంట్ ఇస్తున్నది దేశంలో ఒక్క తెలంగాణ రాష్ట్రం ఒక్కటేనని స్పష్టం చేశారు. గత ప్రభుత్వాల హయాంలో విద్యుత్ కోతల వల్ల, పవర్ హలీడేతో పరిశ్రమలు మూతపడి, వ్యాపారులు ఇతర రాష్ట్రాలకు వలస పోయినట్లు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల నుండి పెట్టుబడిదారులు వచ్చి పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారన్నారు. డీఎక్స్‌ఎన్ కంపెనీ ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయాన్ని పరిశ్రమగా మార్చుకున్నట్లు తెలిపారు. త్వరలో రెండు పంటలు పండించే రోజులు ముందున్నాయన్నారు. ప్రతి నియోజకవర్గంలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు రావాల్సిన అవసరం ఉందన్నారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు సీఎం కేసీఆర్ ముందు చూపుతో పనిచేస్తున్నారన్నారు. గత ముఖ్యమంత్రులు ఆరోజు తమకేం లాభమని ఆలోచిస్తే.. సీఎం కేసీఆర్ భవిష్యత్ తరాల కోసం ఆలోచిస్తున్నారన్నారు. పొల్యుషన్ ఫ్రీతో దాదాపుగా 1500 మందికి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయన్నారు. నంగునూర్ మండలం నర్మెట్టలో జపాన్ దేశానికి సంస్థ చెందిన ప్రతినిధులు ఎగ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సిద్దిపేట ప్రాంతంలో గ్రైనేట్ పరిశ్రమ, సీడ్ పార్క్‌లు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. వంద ఎకారల్లో ఫర్నిచర్ పార్క్, మరో వంద ఎకరాల్లో పశ్చిమబెంగాల్‌కు చెందిన శ్రేయన్ పుడ్‌పార్క్‌ను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రాంతానికి రెండు జాతీయ రహాదారులు అనుసంధానం దిశగా రహదారులు నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. సిద్దిపేటకు చెందిన 22 రైస్‌మిల్లర్స్‌కు ఇక్కడ స్థలాన్ని కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఆధునిక టెక్నాలజీకి వినియోగించటం వల్ల పొల్యూషన్ ఉండదని, ఎలాంటి అనుమతులైనా మంజూరు చేయిస్తానన్నారు. సిద్దిపేట అన్ని రంగాల్లో ప్రథమ స్థానంలో ఉందని, పరిశ్రమల ఏర్పాటుతో మరింత ప్రగతిని సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. టీఎస్‌ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి కొత్త పాలసీని తీసుకొచ్చిందని, పెట్టుబడిదారులు పరిశ్రమల స్థాపనకు ముందుకు వస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో 31 జిల్లాల్లో ఇండస్ట్రియల్ పార్క్‌లు ఏర్పాటు చేసేందుకు కృషిచేస్తున్నట్లు తెలిపారు. 19వేల ఎకరాల్లో ఫార్మాసీటీ కోసం 8వేల ఎకరాల భూసేకరణ, 16వేల ఎకరాల్లో నిమ్జ్ కోసం 4వేల ఎకరాలను ఆధీనంలో తీసుకున్నట్లు పేర్కొన్నారు. 1200 ఎకరాల్లో కాకతీయ టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. సిద్దిపేటను పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. అంతకు ముందు మంత్రి హరీష్‌రావు మొక్కలునాటి, నీరుపోశారు. 22 మిల్లర్లకు స్థలాన్ని కేటాయిస్తూ మంజూరు పత్రాలను అందచేశారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌ఐఐసీ ఎండీ నర్సింహరెడ్డి, డీఎక్స్‌ఎన్ ప్రతినిధి లీన్, సీడీఎస్ చైర్మన్ మల్లెపల్లి లక్ష్మయ్య, మున్సిపల్ చైర్మన్ రాజనర్సు తదితరులు పాల్గొన్నారు.
చిత్రం..వ్యవసాయ ఆధారిత పరిశ్రమ ఏర్పాటుకు శంకుస్థాపన చేస్తున్న మంత్రి హరీష్‌రావు