తెలంగాణ

కేసీఆర్ వ్యాఖ్యలపై ఈసీకి ఫిర్యాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గురువారం హైదరాబాదులో శాసనసభ ఎన్నికల గురించి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్లు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘం నుండి సరైన సమాధానం రానిపక్షంలో కోర్టుకు వెళతానని స్పష్టం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి, ఎన్నికల కమిషనర్లతో చర్చించి సకాలంలో ఎన్నికలు జరిపించుకోవటం గురించి మాట్లాడుకున్న తరువాతనే రాష్ట్ర శాసనసభను రద్దు చేశాను.. అక్టోబర్‌లో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది.. నవంబర్‌లో ఎన్నికలు జరుగుతాయి.. డిసెంబర్‌లో ఫలితాలు వచ్చే అవకాశాలున్నాయని చంద్రశేఖరరావు విలేఖరులతో చెప్పారు. చంద్రశేఖరరావు ఇలా మాట్లాడటం రాజ్యాంగ విరుద్ధం.. కేంద్ర ఎన్నికల సంఘం, చంద్రశేఖరరావు కుమ్మక్కయ్యారనే అనుమానం కలుగుతోంది.. ఈ అనుమానాన్ని నివృత్తి చేసుకునేందుకే కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయనున్నట్లు శశిధర్ రెడ్డి తెలిపారు. చంద్రశేఖరరావు వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం సంతృప్తికరమైన సమాధానం ఇవ్వని పక్షంలో కోర్టుకు వెళతానని అన్నారు. రాష్ట్రంలో ఓటర్ల జాబితా రివిజన్ జరగకుండా అసెంబ్లీ ఎన్నికలు జరిగేందుకు వీలులేదు.. వచ్చే సంవత్సరం జనవరిలో తాజా ఓటర్ల జాబితా సిద్ధమవుతుంది అని ఆయన చెప్పారు. ఈ మధ్యలో 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న యువతీ యువకులు తమ పేర్లను జాబితాలో నమోదు చేసుకుంటున్నారు. వారిని ఓటర్ల జాబితాలో చేర్చుకోకుండా అసెంబ్లీ ఎన్నికలు జరిపించటం చట్ట విరుద్ధం.. యువతీ యువకుల ఓటు హక్కును హరించినట్లు అవుతుందని శశిధర్ రెడ్డి చెప్పారు.