తెలంగాణ

రాష్ట్రం బాగు కోసమే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 6: ఎన్నో పోరాటాలు, త్యాగాల వల్ల సిద్ధించిన తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన తమ ప్రభుత్వాన్ని రాష్ట్రం బాగుకోసమే రద్దు చేసినట్టు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్పష్టం చేసారు. తమ ప్రభుత్వ కాలపరిమితి ముగియక ముందే రద్దు చేయడానికిగల కారణాలను తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసీఆర్ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం టీఆర్‌ఎస్ చేసిన పోరాటం, త్యాగాలను గుర్తించి రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాలనను పరాయివారికి అప్పగించవద్దని ప్రజలు తమకు అత్యంత మెజారిటీ ఇచ్చి అధికారాన్ని అప్పగించారని చెప్పారు. అధికారంలోకి వచ్చాక కొన్ని నెలల పాటు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఆ తర్వాత కుదురుకున్నామన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం సాధించిన ప్రగతిని ప్రధాని, కేంద్ర మంత్రులతో సహా ఇతర రాష్ట్రాలు, సీఎంలు ప్రశంసించారన్నారు. ఎకనామిక్స్ టైమ్స్ పత్రిక అయితే తనకు బిజినెస్ రిఫార్మర్ అవార్డు కూడా ఇచ్చిందని కేసీఆర్ గుర్తు చేసారు. అలాగే ఇప్పటి వరకు 40కి పైగా తమ ప్రభుత్వానికి అవార్డులు వచ్చాయన్నారు. తెలంగాణతో పోటీపడే రాష్ట్రాలు దేశంలోనే లేవన్నారు. అన్నింట్లోనూ అగ్రస్థానంలో నిలిచిందన్నారు. గత నాలుగేళ్లలో రాష్ట్ర సొంత ఆదాయ వృద్ధి 17.17 శాతం సాధించగా, ఈ ఆర్థిక సంవత్సరంలో ఇది 21.96 శాతానికి చేరుకుందన్నారు. ఓ వైపు ప్రగతిలో రాష్ట్ర దూసుకుపోతుంటే, ప్రతిపక్షాలేమో పసలేని ఆరోపణలతో విమర్శిస్తున్నాయన్నారు. నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మాణాలను కోర్టులకు వెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. ప్రతిపక్షాలు అదే పనిగా చేస్తున్న విమర్శలు, ఆరోపణల వల్ల ప్రభుత్వంలోని వారికి, అధికారులకు మనస్థైర్యం దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. తెలంగాణ అభివృద్ధి ఆగకూడదని, ఆరోపణలు చేసే ప్రతిపక్షాల నోళ్లు మూయించాలనే మరోసారి ప్రజా క్షేత్రంలోనే తేల్చుకునేందుకే శాసనసభను రద్దు చేసినట్టు ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ వివరించారు.