తెలంగాణ

చొప్పదండి ఎమ్మెల్యే స్వయంకృతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చొప్పదండి, సెప్టెంబర్ 6: అనూహ్యంగా చొప్పదండి నియోజకవర్గం నుంచి 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్‌ను దక్కించుకున్న బొడిగ శోభకు ఈసారి టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ షాక్ ఇచ్చారు. మొదటి నుంచీ అధిష్ఠానంతో సత్సంబంధాలు కొనసాగించడంలో విఫలమవుతూ వార్తల్లో నిలిచారు. నియోజకవర్గంలోని ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచడం, పలుమార్లు వివాదాస్పదంగా వ్యవహరించడం కొంప ముంచింది. ఈ మధ్యనే ప్రగతి భవన్‌లో జిల్లా మంత్రి ఈటల రాజేందర్ నేతృత్వంలో చొప్పదండి నియోజకవర్గ ద్వితీయ శ్రేణి ప్రజాప్రతినిధులతో కో-ఆర్డినేషన్ సమావేశాన్ని నిర్వహించాల్సిందిగా స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. చొప్పదండి, రామడుగు, గంగాధర, బోయినిపల్లి, కొడిమ్యాల జడ్పీటీసీలతో పాటు రామడుగు, కొడిమ్యాల ఎంపీపీలు తమతో సఖ్యంగా వ్యవహరించడం లేదని వాపోయారు. పార్టీ కార్యక్రమాలలో పాల్గొననీయకుండా దూరం పెడుతున్నారంటూ ఇది పార్టీకి మంచి పరిణామం కాదంటూ ఫిర్యాదు చేసినా ఎమ్మెల్యే శోభ భర్త గాలన్న కలుపుకొనిపోయేది లేదంటూ కరాఖండిగా చెప్పడం, అక్కడి నుండి మంత్రి మధ్యలోనే వెళ్లిపోయినట్లు ఇప్పటికే ప్రచారం కొనసాగింది. నియోజకవర్గంలో సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని స్వయంగా కార్యక్రమాలు చేపట్టడం, అందులో ముఖ్యమంత్రికి, పార్టీకి ప్రాధాన్యత ఇవ్వకపోవడం అధిష్ఠానం దృష్టికి వెళ్లినట్లు తెలిసింది. కొడిమ్యాలలో జరిగిన ఓ కార్యక్రమంలో ఐటీ మంత్రి కేటీఆర్‌ను అడ్డుకోవడం కూడా అధినాయకత్వానికి ఆగ్రహం తెప్పించింది. చొప్పదండి మార్కెట్ కమిటీ చైర్మన్ విషయంలో మొదటి నుంచి పార్టీకోసం పాటుపడుతున్న గడ్డం చుక్కారెడ్డి సతీమణి సుమలతకు ఇచ్చేందుకు అదిష్ఠానం నిర్ణయం తీసుకోగా శోభ మరో కార్యవర్గాన్ని అధిష్ఠానం వద్దకు తీసుకెళ్లారు. దీంతో అధిష్ఠానం చుక్కారెడ్డిని ఎమ్మెల్యేను కలువాల్సిందిగా కోరింది. పలుమార్లు చుక్కారెడ్డి ఇంటికి వెళ్లిన పట్టించుకోకపోవడం ఎంపీ, మంత్రి చొరవ చూపినా ఎమ్మెల్యే ధిక్కరించారు. దీంతో కేసీఆర్ స్వయంగా చుక్కారెడ్డిని పిలిపించుకొని ఆయన భార్య సుమలతకు చొప్పదండి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని అప్పగించారు. అయితే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎమ్మెల్యేను ఆహ్వానించాలని అధిష్ఠానం కోరడంతో చుక్కారెడ్డి ఎమ్మెల్యేను ఆహ్వానించారు. సుమలత ప్రమాణస్వీకారానికి మంత్రి, ఎంపీలు రాగా, ఎమ్మెల్యే గైర్హాజరయ్యారు. అలాగే గుండ్లపల్లి టోల్‌గేటు వద్ద ఎమ్మెల్యేకు మర్యాద ఇవ్వలేదంటూ సబ్బందిపై దాడి చేశారు. ఈ మధ్యనే చొప్పదండిలో ఫైర్ స్టేషన్ ప్రారంభోత్సవానికి మంత్రి ఈటల, ఎంపీ వినోద్ కుమార్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు వచ్చారు. ఈ కార్యక్రమం కొనసాగుతుండగా ఎంపీ వినోద్ స్వయంగా చుక్కారెడ్డిని పిలిచి కొబ్బరికాయ కొట్టాల్సిందిగా కోరారు. దీంతో ముందుకు వస్తున్న చుక్కారెడ్డిని తోసి వేయడంతో కలకలం రేపింది. కాగా గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన 105 మంది జాబితాలో చొప్పదండి టికెట్‌ను ఎవరికి ఇవ్వలేదు. చొప్పదండి అభ్యర్థి విషయంలో ద్వితీయ శ్రేణి నాయకుల అభిప్రాయం అధినేత వాకబుచేసినట్టు తెలిసింది. గడ్డం వివేక్, సుంకె రవి శంకర్, గజ్జెల స్వామి పేర్లను అధిష్ఠానం పరిశీలిస్తున్నట్లు తెలిసింది. గడ్డం వివేక్ చెన్నూర్ అసెంబ్లీ టికెట్‌ను ఆశించగా, అక్కడి నుంచి బాల్క సుమన్‌కు అవకాశం కల్పించారు. దీంతో వివేక్‌ను చొప్పదండి నుంచి బరిలోకి దించుతారనే ప్రచారం కొనసాగుతోంది. మరో ప్రక్క చొప్పదండి నియోజకవర్గానికి చెందిన ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు సుంకె రవిశంకర్ పేరు కూడా పరిశీలనో ఉందని అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ ఎమ్మెల్యే శోభ స్వయంకృపరాదం వల్లే ఈ పరిస్థితి నెలకొందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయ.