తెలంగాణ

ఓదేలుకు షాక్... రాథోడ్ రమేష్‌కు ఝలక్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్,సెప్టెంబర్ 6: అనూహ్యంగా అసెంబ్లీని రద్దుచేసి ముందస్తు ఎన్నికల నగారా మోగించిన టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు మంచిర్యాల జిల్లా చెన్నూర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ నల్లాల ఓదేలుకు ఝలక్ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమం నుండి పార్టీని అంటిపెట్టుకొని కేసీఆర్‌కు వెన్నంటే నిలుస్తూ మూడుసార్లు శాసన సభ్యునిగా ఎన్నికైన నల్లాల ఓదేలుకు ఈసారి 105 మంది జాబితాలో చోటు దక్కకపోవడం విస్మయం కల్గించింది. కేసీఆర్ తీసుకున్న అనూహ్య పరిణామానికి ఆయన వర్గీయులు షాక్ నుండి కోలుకోలేకపోతున్నారు.
ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా నుండి తొమ్మిది మంది సిట్టింగ్‌లందరికీ పార్టీ టికెట్లు ఖరారు చేసి ఓదెలుకు మాత్రం మొండిచేయి చూపడంపై చెన్నూర్ నియోజకవర్గంలోని పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి రాజుకుంటోంది. 2009 సాధారణ ఎన్నికలతో పాటు 2010 ఉప ఎన్నికల్లో, 2014 సార్వత్రిక ఎన్నికల్లో వరసగా మూడుసార్లు టీఆర్‌ఎస్ పార్టీ తరపున గెలిచిన నల్లాల ఓదేలు సింగరేణి కార్మిక క్షేత్రంలోనూ తనకంటూ ప్రాబల్యం పెంచుకున్నాడు. అయితే కాంగ్రెస్ పార్టీ వీడి కేసీఆర్ సమక్షంలో గులాబి కండువా కప్పుకున్న మాజీ ఎంపీ గడ్డం వివేక్, ఆయన సోదరుడు గడ్డం వినోద్‌లు ఎంపి, ఎమ్మెల్యే టికెట్లను ఆశించి తన సామాజిక వర్గంతో కేసీఆర్‌పై ఒత్తిడి తీసుకరావడం వల్లే ఎంపీ బాల్క సుమన్‌కు చెన్నూర్ అసెంబ్లీ స్థానాన్ని సర్దుబాటు చేయాల్సి వచ్చిందని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ముందస్తు ఎన్నికల్లో బరిలో నిలిచిన బాల్క సుమన్ గెలుపు ఓటముల మాట అటుంచితే పెద్దపల్లి పార్లమెంట్ స్థానాన్ని వివేక్‌కు కట్టబెట్టేందుకే కేసీఆర్ పథక రచన సాగించినట్లు తెలుస్తోంది.
చెన్నూర్ స్థానాన్ని ఆశించిన జి.వినోద్‌కు భంగపాటే ఎదురైంది. ఎంపీగా వివేక్ మాత్రం బరిలో పోటీ చేయడం ఖాయమని టీఆర్‌ఎస్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. హ్యాట్రిక్ ఎమ్మెల్యే నల్లాల ఓదేలుకు టికెట్ల జాబితాలో పేరు గల్లంతు కావడంపై ఆయన అంతర్మదనంలో పడ్డారు. ఎన్నికల్లో తిరుగుబాటు అభ్యర్థిగా పోటీ చేస్తారా.. కాంగ్రెస్ టికెట్‌తో బరిలో నిలుస్తారా అన్నది రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
తెలుగుదేశం పార్టీలో పోలిట్‌బ్యూరో సభ్యుడిగా మాజీ ఎంపిగా, జడ్పీ చైర్మెన్, శాసన సభ్యుడిగా రాజకీయ పదవుల్లో తనకంటూ ప్రత్యేకతను చాటుకొని రాజకీయాలను శాసించిన రాథోడ్ రమేష్ పరిస్థితి రెంటికిచెడ్డ రేవడిలా మారింది. తన తనయుడికి ఆదిలాబాద్ పార్లమెంట్ టికెట్, తనకు ఖానాపూర్ అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని షరతు పెట్టి మంత్రి తుమ్మల నాగేశ్వర రావు రాయబారంతో కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరిన రమేష్ రాథోడ్‌కు అసెంబ్లీ టికెట్ దక్కకపోవడం ఆయన వర్గీయుల్లో అసంతృప్తికి ఆజ్యం పోసినట్లయింది. ఖానాపూర్ స్థానాన్ని సిట్టింగ్ అభ్యర్థి రేఖానాయక్‌కు కేటాయించడంతో రాథోడ్ వర్గీయులు అగ్రహంతో రాజీనామాలకు సిద్దపడుతున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా రమేష్ రాథోడ్ పోటీపడడం ఖాయమని ఆయన వర్గీయులు తేల్చి చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇద్దరు సీనియర్లకు కెసిఆర్ మొండిచేయి చూపడం, టీఆర్‌ఎస్ వర్గాల్లో కలకలం రేపుతోంది.