తెలంగాణ

ఎక్కెల్లిపై ఎందుకా సస్పెన్స్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, సెప్టెంబర్ 6: కాంగ్రెస్ పార్టీకి కంచుకోట, జహీరాబాద్ నియోజకవర్గంలో తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యే గీతారెడ్డికి చెక్ పెట్టేందుకు టీఆర్‌ఎస్ పార్టీ మల్లగుల్లాలు పడుతోంది. ముందస్తు ఎన్నికలకు సిద్ధమైన గులాబి దళపతి కేసీఆర్ రాష్ట్రంలోని 119 అసెంబ్లీ సెగ్మెంట్లలో 105 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఉమ్మడి మెదక్ జిల్లాలోని పది అసెంబ్లీ సెగ్మెంట్లకుగాను 9 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్ ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గమైన జహీరాబాద్‌కు మాత్రం అభ్యర్థిని ప్రకటించకపోవడంతో చర్చనీయాంశంగా మారింది. రాజ్యాంగ బద్దంగా ఎన్నికల నిర్వహణ ప్రారంభమైనప్పటి నుంచి జహీరాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లో ఇప్పటి వరకు ఒకే ఒక సారి కాంగ్రెస్సేతర అభ్యర్థికి ఓటర్లు పట్టం కట్టారు. 2009 సార్వత్రిక ఎన్నికల వరకు జనరల్ నియోజకవర్గంగా ఉన్న జహీరాబాద్ 2009 ఢీ లిమిటేషన్‌లో ఎస్సీ రిజర్వ్‌డ్‌గా అవతరించింది. అప్పటి నుంచి ఈ నియోజకవర్గం నుంచి గీతారెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
గడచిన 2014 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సాధన సెంటిమెంట్ సైతం ఈ నియోజకవర్గ ఓటర్లును ప్రాభావితం చేయలేకపోగా సిట్టింగ్ ఎమ్మెల్యేగా బరిలోకి దిగిన గీతారెడ్డికే మరో అవకాశం కల్పించారు. రిటైర్డ్ ఉద్యోగి, స్థానికుడైన మానిక్‌రావును టీఆర్‌ఎస్ రంగంలోకి దింపగా స్వల్ప మెజార్టీతో కాంగ్రెస్ తన పైచేయిని నిలుపుకుంది. జహీరాబాద్‌తో పాటు నారాయణఖేడ్ నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్‌కి మంచి పట్టున్నప్పటికీ ఖేడ్ నియోజకవర్గానికి అనివార్యమైన ఉప ఎన్నికతో ఆ స్థానాన్ని టీఆర్‌ఎస్ తన ఖాతాలో జమ చేసుకుంది. ప్రస్తుతం ఒకే ఒక్క జహీరాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లో కాంగ్రెస్ పార్టీని అధిగమించేందుకు టీఆర్‌ఎస్ పార్టీ పావులు కదుపుతోంది. ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు గతంలో ఓడిపోయిన మానిక్‌రావుతో పాటుగా రాష్ట్ర ఎస్సీ సెల్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, స్థానికుడు, యువకుడు, నియోజకవర్గంలో తనకంటూ ప్రజల్లో ముద్ర వేసుకుంటున్న జర్నలిస్టు ఎల్గోయి ప్రభాకర్‌లు టికెట్ కోసం పోటీ పడుతున్నారు. నియోజకవర్గానికి సంబంధించిన పూర్తి వివరాలను టీఆర్‌ఎస్ రాష్ట్ర అధ్యక్షులు కేసీఆర్ ఇంటలిజెన్స్‌వర్గాల ద్వారా పూర్తి నివేదికలు తెప్పించుకున్నట్లు సమాచారం. అభ్యర్థి ఎవరన్న ప్రమేయం లేకుండా గెలుపు గుర్రాన్ని రంగంలోకి దింపి కాంగ్రెస్ కంచుకోటకు గండికొట్టాలన్న లక్ష్యంతో టీఆర్‌ఎస్ చాపకింద నీరులా పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఎర్రోళ్ల శ్రీనివాస్ స్థానికుడు కాదని, స్థానికులకే అవకాశం కల్పించాలని పార్టీకి చెందిన మెజార్టీ కార్యకర్తలు అధిష్టానంపై వత్తిడి తెస్తున్నట్లు సమాచారం. కాగా గడచిన ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన మానిక్‌రావు కూడా తనకు మరో అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. యువతకు ప్రాధాన్యతను ఇస్తే తనకు అవకాశం కల్పిస్తే సత్తా చాటుకుంటానని ఎల్గోయి ప్రభాకర్ అధిష్టానానికి విన్నవించుకోవడంతో పాటు గ్రామాలకు చెందిన వివిధ స్థాయిల ప్రజాప్రతినిధులతో కూడా సిఫార్సు చేయించుకున్నట్లు తెలిసింది. మొత్తంమీద కాంగ్రెస్ పార్టీని అధిగమించాలన్న లక్ష్యంతో టీఆర్‌ఎస్ వ్యూహరచనలు చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.