తెలంగాణ

కొండా దంపతుల దారెటు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, సెప్టెంబర్ 6: ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండ సురేఖ రాజకీయ భవిష్యత్‌పై మరోసారి చర్చ తెరపైకి వచ్చింది. అసెంబ్లీ రద్దు తర్వాత అపద్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం 105మందితో కూడిన జాబితాను ప్రకటించారు. అందులో టీఆర్‌ఎస్ ఉమ్మడి జిల్లాలో ఉన్న 11 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలలో 10మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు చోటు కల్పించి వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ పేరు ప్రకటించకపోవడం పట్ల రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ ప్రకటించిన తొలి జాబితాలో కొండా సురేఖ పేరు లేక పోవడం పట్ల కొండ దంపతుల అనుచరులు కేసీఆర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తునట్లు తెలిసింది. కాగా టీఆర్‌ఎస్ ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్ధుల జాబితాలో తమ పేరు లేకపోవడం అవమానకరంగా కొండా దంపతులు భావిస్తున్నారు. మొన్నటి వరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని స్పీకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న భూపాలపల్లి నియోజకవర్గంతో పాటు వరంగల్ తూర్పు నుండి పోటి చేస్తామని బహిరంగంగా ప్రకటించిన కొండా దంపతులకు కేసీఆర్ షాక్ ఇచ్చారు. భూపాలపల్లి నియోజకవర్గం నుండి అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే మధుసూదనాచారి పేరు ప్రకటించి కొండా సురేఖ ప్రాతినిధ్యం వహిస్తున్న సీటును పెండింగ్‌లో పెట్టడం మరింత ఆగ్రహం తెప్పించినట్లైంది. దీంతో కొండా దంపతులు కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ నెల 9న రాహుల్‌గాంధీ సమక్షంలో కొండా దంపతులు కాంగ్రెస్‌లో చేరుతారంటూ ప్రచారం జరుగుతుంది. కొండా దంపతులు టీఆర్‌ఎస్‌లో చేరినప్పటి నుండి ఆ పార్టీలో ఇమడ లేకపోతున్నారు. వారి వైరీ వర్గం అంతా టీఆర్‌ఎస్‌లో ఉండడం వారికి మింగిడుపడడం లేదు.
గత కొన్ని రోజుల నుండి కొండా దంపతులు కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం ఊపందుకుంది. ఇటీవల కార్పోరేషన్ పరిధిలో మేయర్ వర్సెస్ కొండా దంపతుల మధ్య జరిగిన వివాదం టీఆర్‌ఎస్ అధిష్టానానికి చేరింది. మేయర్ నరేందర్‌పై కొండ సురేఖ చేసిన తీవ్ర విమర్శలు చర్చనీయాంశంగా మారాయి.