తెలంగాణ

బాబూమోహన్‌కు షాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, సెప్టెంబర్ 6: సినిమా రంగంలో హాస్యనటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న బాబుమోహన్‌ను రాజకీయాల్లోకి తీసుకువచ్చి గెలుపును నిర్దేశించి భవిష్యత్తు కల్పించిన టీఆర్‌ఎస్ అధినేత.. నేడు అదే బాబుమోహన్‌కు టికెట్ కేటాయించడానికి నిరాకరిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ ఆశ్చర్యపర్చారు. ముక్కుసూటిగా తన, మన భేదాభిప్రాయం లేకుండా మాట్లాడే మనస్తత్వం కలిగిన బాబుమోహన్ నాలుగేళ్లకుపైగా పదవి కాలంలో వ్యవహరించిన తీరుతో అందోల్ నియోజకవర్గం టీఆర్‌ఎస్ శ్రేణుల్లో అపవాదును మూటగట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బాబుమోహన్‌కు టికెట్ ఇవ్వకుండా స్థానికుడైన ఓ టీవీ చానల్ జర్నలిస్టుకు టికెట్ కేటాయించినట్లు స్పష్టమవుతోంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నప్పుడు అందోల్ ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న మల్యాల రాజయ్యతో రాజీనామా చేయించి సిద్దిపేట పార్లమెంట్ సభ్యుడిగా బరిలోకి దింపి గెలిపించుకున్నారు. దీంతో 1998లో అందోల్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. అప్పటికే రాజకీయాల్లోకి రావాలని తహతహలాడుతూ అన్న తెలుగుదేశం పార్టీ పక్షాన సిద్దిపేట నియోజకవర్గం నుండి కేసీఆర్‌పై బాబుమోహన్ పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అనంతరం బాబుమోహన్ కూడా తెలుగుదేశం పార్టీకి దగ్గరగా రావడం, అందోల్ ఉప ఎన్నికలో అవకాశం లభించడంతో బరిలోకి దిగారు. అప్పటికే కేసీఆర్ రాష్ట్ర రవాణ శాఖ మంత్రిగా చంద్రబాబు మంత్రివర్గంలో సముచిత స్థానంలో ఉన్నారు. అందోల్ ఉప ఎన్నిక బాధ్యతను తన భుజస్కందాలపై వేసుకున్న కేసీఆర్ అన్ని మండలాలు, గ్రామాలను జల్లెడపట్టి టీడీపీ అభ్యర్థి బాబుమోహన్ గెలుపుకు కృషి చేసి చట్టసభలోకి తీసుకువెళ్లారు. అనంతరం కేసీఆర్ మలివిడత తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించి టీఆర్‌ఎస్ పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. 2004 ఎన్నికల్లో అందోల్ నుండి పోటీ చేసిన బాబుమోహన్ ఓడిపోవడం, సిద్దిపేట అసెంబ్లీ సెగ్మెంట్‌లో వచ్చిన ఉప ఎన్నికలో మంత్రి హోదాలో బాబుమోహన్ ప్రచారానికి వెళ్లగా అక్కడ టీఆర్‌ఎస్ శ్రేణులు తిరుగుబాటుకి దిగిన విషయం తెలిసిందే. 2014లో తెలంగా రాష్ట్ర సాధన, టీడీపీ ఉనికి కష్టతరంగా మారడంతో అందరు నేతల మాదిరిగానే బాబుమోహన్ సైతం గులాబి గూటికి చేరుకున్నారు. బావ, మరుదులుగా సంబోధించుకునేంతగా కేసీఆర్‌తో బాబుమోహన్ సత్సంబంధాలు పెంచుకున్నారు. 2014 ఎన్నికలకు ముందు బాబుమోహన్‌కు టికెట్ కేటాయించడానికి ముందుగానే మార్చి నెలలో అందోల్ నియోజకవర్గ కేంద్రమైన జోగిపేటలో ఎన్నికల శంఖరావాన్ని కేసీఆర్ పూరించారు. చివరి క్షణంలో బాబుమోహన్‌కు టికెట్‌ను కేటాయించగా సిట్టింగ్ ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రి హోదాలో బరిలోకి దిగిన దామోదర్ రాజనర్సింహపై 3 వేల పైచీలుకు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. గెలిచినప్పటి నుంచి నియోజకవర్గానికి చెందిన పార్టీ నాయకులు, ఆయా హోదాల్లో పని చేస్తున్న అధికారులపై బాబుమోహన్ పలు సందర్భాల్లో వివాదాల్లో ఇరుక్కున్నారు. ఇటీవలే టీఆర్‌ఎస్ పార్టీ నిర్వహించిన ప్రగతి నివేదన సభకు వెళ్లే వాహనాలకు జెండా ఊపుతూ ప్రారంభిస్తున్న క్రమంలో బాబుమోహన్ ఓ కార్యకర్తను కాలుతో తన్నడానికి సిద్దమైన వీడియో క్లిప్పింగు సోషల్ మీడియాలో నేటికి చక్కర్లు కొడుతూనే ఉంది. వీటన్నింటిని పరిగణలోకి తీసుకునే సీఎం కేసీఆర్ బాబుమోహన్‌కు టికెట్ ఇవ్వడానికి నిరాకరించినట్లు స్పష్టమవుతోంది. రెండు దశాబ్దాల కాలంగా ఇద్దరి మద్యన కొనసాగిన అనుబంధానికి తెరపడిందని చెప్పవచ్చు. ఇతర పార్టీలోకి వెళతారా, లేక స్వతంత్రంగా బరిలోకి దిగుతారా వేచి చూడాలి.