తెలంగాణ

టీఆర్‌ఎస్ ఓటమి తథ్యం: కోమటిరెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, సెప్టెంబర్ 6: సీఎం కేసీఆర్ అసెంబ్లీ రద్ధు చేసి ముందస్తు ఎన్నికలతో సెల్ఫ్‌గోల్ చేసుకున్నారని, ఎన్నికల్లో టిఆర్‌ఎస్ పార్టీకి పరాజయం తప్పదని సిఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. గురువారం నల్లగొండలో ఆయన విలేఖరులతో మాట్లాడుతు సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లడం, అభ్యర్థులను ముందస్తుగా ప్రకటించడం ఆయన ఒంటెద్దు పోకడలకు, ఆహంభావ ధోరణికి నిదర్శనమన్నారు. టిఆర్‌ఎస్ అభ్యర్థులను ముందే ప్రకటించి కాంగ్రెస్‌కు పనిభారం తగ్గించారని, కేసీఆర్ తాను తీసుకున్న గోతిలో తానే పడ్డారని, రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నారన్నారు. టిఆర్‌ఎస్ అభ్యర్థుల ప్రకటనతో కాంగ్రెస్ పార్టీ బలం 100సీట్లకు పెరిగినట్లేనన్నారు. రౌడీయిజం చెలాయించేవారికి, భూకబ్జాదారులకు కేసీఆర్ టికెట్లు ఇచ్చి కాంగ్రెస్ గెలుపు సులభతరం చేశారన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పది సీట్లు తగ్గకుండా గెలుస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి ఇంకా ఎనిమిది నెలల పాలన సమయం ఉందని అప్పటిదాకా కేసీఆర్ కుటుంబ పాలన ఎలా భరించాలో అంటు మధనపడుతుండగా స్వయంగా కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్ధు చేసుకోవడంతో ప్రజలు సంతోషిస్తున్నారన్నారు. కేసీఆర్ కుటుంబ పాలన పీడ విరగడైనందుకు దసరా, దీపావళీలను సంబరంగా జరుపుకోవాలన్నారు. ఐఆర్ ద్వారా వేలాది ఉద్యోగాలిస్తామని, లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని, దళితులకు మూడెకరాల భూమి, పేదలకు డబుల్ బెడ్‌రూమ్‌లు, ఎస్టీ, ఎస్సీలకు పనె్నండు శాతం రిజర్వేషన్లు అంటు మాయమాటలతో అధికారంలోకి వచ్చి ఎన్నికల హామీలను తుంగలో తొక్కి ప్రజలను మోసగించాడన్నారు. ప్రాజెక్టుల రీడైజన్‌తో, మిషన్ కాకతీయ, మిషన్‌భగీరథ ఫ్రాజెక్టులతో వేలకోట్ల కమిషన్లు దండుకున్నారన్నారు. ఫిరాయింపులు, నియంతృత్వ పాలన, ప్రతిపక్షాలను అణిచివేసి మరో నిజాంగా మారిన కేసీఆర్‌కు ప్రజలు రానున్న ఎన్నికల్లో తప్పక గుణపాఠం చెబుతారన్నారు. కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోకు స్పందన వస్తుందన్నారు. కాంగ్రెస్ శ్రేణులంతా ఒక్కతాటిపై నిలిచి రానున్న మూడు నెలలు కష్టపడి పనిచేసి పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడం ద్వారా తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ రుణం తీర్చుకోవాలన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, డిసిసిబి డైరక్టర్ సంపత్‌రెడ్డి, డిసిసి నాయకులు గుమ్మల మోహన్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

చిత్రం..నల్లగొండలో విలేఖరులతో మాట్లాడుతున్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి