తెలంగాణ

రాజకీయ ఒత్తిళ్లకు లొంగొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 6: తెలంగాణ రాష్ట్రంలో ఆపద్ధర్మ ప్రభుత్వం పనిచేయడం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు మంత్రులు ఆపద్దర్మంగా కొనసాగతారు. ఈ పరిస్థితిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై కీలక బాధ్యతలు పడ్డాయి. మళ్లీ కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు ప్రభుత్వ యంత్రాంగం రాజకీయ వత్తిళ్లకు లొంగకుండా పనిచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్.కే. జోషి వౌఖిక ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రివర్గ సభ్యులు ఆపద్ధరంగా కొనసాగతారంటూ జోషి పేరుతో గురువారం జీఓ (ఎంఎస్ నెంబర్ 134) జారీ అయింది.
ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు, జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వౌఖిక ఆదేశాలు జారీ చేస్తూ, రాజకీయ వత్తిళ్లకు లొంగకుండా పనిచేయాలని విజ్ఞప్తి చేశారని తెలిసింది. రాజకీయ నేతల ప్రమేయం ఏ దశలోనూ లేకుండా మామూలుగానే పనిచేస్తూ వెళ్లండంటూ ఆదేశించారు. 2018-19 సంవత్సరానికి బడ్జెట్ కేటాయింపులకు అనుగుణంగా ఖర్చులు చేయవచ్చని జోషి స్పష్టం చేశారు.
ఇప్పటికే జారీ అయిన జీఓలన్నీ అమల్లో ఉంటాయి. అందుకే అసెంబ్లీ రద్దు జరిగే సమయానికి ముందు చివరి రెండురోజుల్లో కీలకమైన అంశాల్లో జీఓలు జారీ అయ్యాయి. కేసీఆర్ నేతృత్వంలో గురువారం మంత్రివర్గం సమావేశమై అసెంబ్లీని రద్దు చేయడానికి నిర్ణయం తీసుకున్న సమయానికి కొద్దిగా ముందు కూడా అనేక జీఓలు జారీ అయ్యాయి. నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన అనుమతుల జీఓలు కూడా వీటిలో ఉన్నాయి.
అధికారుల బదిలీలకు సంబంధించి జీఓలు కూడా ఉన్నాయి. సంక్షేమ పథకాలు యథావిధిగా కొనసాగతాయి. వ్యవసాయానికి సంబంధించి యాసంగి పంటకు రైతులకు ఇవ్వాల్సిన పెట్టుబడి సాయం (రైతుబంధు) నిధులను విడుదల చేస్తూ నెలరోజుల క్రితమే జీఓ జారీ చేసిన విషయం గమనార్హం. రైతుబంధు నిధులను అక్టోబర్, నవంబర్ నెలల్లో రైతులకు అందచేసేందుకు ప్రణాళిక సిద్ధంగా ఉంది. 39 లక్షల వరకు ఉన్న సంక్షేమ పింఛన్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నిధుల కేటాయింపు జరిగింది. సన్నబియ్యం సరఫరాకు కూడా ఎలాంటి ఆటంకం జరగకుండా చర్యలు తీసుకున్నారు. సమాజంలో అన్ని వర్గాలకు ఏదో ఒక రకంగా లబ్ది జరిగేలా రూపొందించిన ప్రణాళికలు అమలవుతున్నాయి.
సచివాలయంలో గురువారం అసెంబ్లీ రద్దు గురించే ప్రధానంగా చర్చ జరిగింది. ఉన్నతాధికారులు దాదాపు అందరూ కూడా మళ్లీ టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తుందన్న భావనతోనే ఉన్నారు. కొత్త పథకాలు, కొత్త కార్యక్రమాలు ఏవీ ప్రకటించేందుకు ఆపద్దర్మ ప్రభుత్వానికి అధికారం ఉండబోదని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇప్పటికే ప్రకటించిన పథకాలు, కార్యక్రమాలు మాత్రం యథాతథంగా కొనసాగుతాయని ఆయన వివరించారు.