తెలంగాణ

కేంద్ర నిధులపై కన్ను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 29: కేంద్రం నుంచి అధిక నిధులు సాధించే అంశంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. ఉమ్మడిలో ఉన్నప్పుడు రాష్ట్రానికి కేంద్రం నుంచి ఎన్ని నిధులు వచ్చేవో అంతే మొత్తాన్ని రాబట్టుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై సర్కారు కసరత్తు మొదలెట్టింది. ఉమ్మడిలో 23 జిల్లాలకు కేంద్రం నుంచి వచ్చే నిధులు రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో పది జిల్లాలు మాత్రమే ఉండటంతో సగానికి సగం తగ్గిపోయాయి. దీంతో మునుపటి మాదిరిగా నిధులు సాధించడానికి రాష్ట్రంలో జిల్లాల సంఖ్యను 10 నుంచి 24కు పెంచడానికి ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టిన విషయం తెలిసిందే. జిల్లాల సంఖ్య పెంపుతోనే వదిలేయకుండా గ్రామ పంచాయతీలనూ నిధుల కేటాయింపునకు కేంద్రం యూనిట్‌గా తీసుకుంటుండటంతో వాటి సంఖ్యనూ పెంచడానికి పంచాయతీరాజ్ శాఖ కసరత్తు చేస్తుంది. మొదటి దశలో ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీ మేరకు గిరిజన గూడాలు, తండాలను జనాభా ప్రాతిపదికన గ్రామ పంచాయతీలుగా మార్చడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. అయితే గ్రామ పంచాయతీలకు ఎన్నికైన సర్పంచ్‌లు, వార్డు సభ్యుల కాలపరిమితి 2017లో ముగియనుంది. వీటికి 2013లో ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఇలా ఉండగా స్థానిక ప్రజాప్రతినిధుల కాలపరిమితి ఇంకా ముగియక పోవడంవల్ల న్యాయపరమైన చిక్కులు తలెత్తే అవకాశం ఉండటంతో, పంచాయతీల విస్తరణను వచ్చే ఏడాదే ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తుంది. పంచాయతీరాజ్ శాఖ చేసిన కసరత్తు మేరకు రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న గ్రామ పంచాయతీల సంఖ్య 8685 నుంచి 10,442కు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయ. గిరిజనుల జనాభా 500 దాటిన తండాలు, గూడెంలను గ్రామ పంచాయతీలుగా మార్చడం వల్ల రాష్ట్రంలో అదనంగా 1757 కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పడనున్నాయి. దీనివల్ల గ్రామాన్ని యూనిట్‌గా తీసుకునే కేంద్రం నుంచి వీటికి నేరుగా నిధులు అందనున్నాయి. 14వ ఆర్థిక సంఘం సిఫారసు మేరకు గ్రామ పంచాయతీలను యూనిట్‌గా కేంద్రం నిధులు కేటాయిస్తున్న సంగతి తెలిసిందే. లంబాడి తండాలను, గూడాలను గ్రామ పంచాయతీలుగా గుర్తించాలని గిరిజన సంఘాలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాము అధికారంలోకి వస్తే తండాలు, గూడెంలకు గ్రామ పంచాయతీ హోదా కల్పిస్తామని తెరాస ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చింది. ఒకవైపు గిరిజనులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నట్టు అవుతుంది, మరోవైపు కేంద్రం నుంచి అధిక నిధులు పొందడానికి అవకాశం ఏర్పడతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది.
పంచాయతీరాజ్ శాఖ చేసిన కసరత్తు మేరకు కొత్త గ్రామ పంచాయతీలలో అత్యధికంగా వరంగల్‌లో జిల్లాలో 304, మహబూబ్‌నగర్ జిల్లాలో 267, నల్లగొండ జిల్లాలో 257, ఖమ్మం జిల్లాలో 255, ఆదిలాబాద్ జిల్లాలో 224, రంగారెడ్డి జిల్లాలో 117, కరీంనగర్ జిల్లాలో 47 మొత్తంగా 1757 కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు కాబోతున్నాయి. ప్రస్తుతం తీసుకున్న జనాభా లెక్కలు 2011 నాటివి కావడం వల్ల ప్రస్తుతం ఏర్పాటయ్యే గ్రామ పంచాయతీలతో పాటు తిరిగి జనాభా లెక్కలు జరిగే నాటికి గ్రామ పంచాయతీల సంఖ్య రాష్ట్రంలో గణనీయంగా పెరిగి 15 వేల వరకు చేరుకునే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.