తెలంగాణ

అసెంబ్లీ రద్దు అప్రజాస్వామికం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 6: రాష్ట్రంలో గత నాలుగున్నరేళ్లలో సీఎం కేసీఆర్ నియంతలా వ్యవహరించారని, ఆయనను అదుపు చేయాలని బీజేపీ నేతలు గురువారం నాడు గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్‌కు ఫిర్యాదు చేశారు. అనేక సందర్భాల్లో సీఎం దూకుడుగా వ్యవహరించి విపక్షాలపై విరుచుకుపడ్డా రని ఇది ప్రజాస్వామ్యంలో తగదని అన్నారు. రాష్ట్రంలో ఆరు నెలల ముందే అసెంబ్లీ రద్దు అప్రజాస్వామికమని వారు చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్, కేంద్ర మాజీ మంత్రి బండారుదత్తాత్రేయ, పార్టీ నేతలు జీ కిషన్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, ఎన్‌వీవీఎస్ ప్రభాకర్, ఎమ్మెల్సీ ఎన్ రామచందర్‌రావులు గవర్నర్‌ను కలిశారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు రెండు పేజీల లేఖను గవర్నర్‌కు అందజేశారు. సీఎం ఇష్టారాజ్యంగా వ్యవహరించారని, రాజ్యాంగ సంస్థలను కాలరాశారని, ప్రజాస్వామ్య నియమాలను తుంగలో తొక్కారని , చివరకి మీడియాను కూడా బెదిరించారని పేర్కొన్నారు. రాష్ట్రం తన సొంత జాగీరు మాదిరి సీఎం వ్యవహరించారని, విపక్షాలకు నోరువిప్పే అవకాశం లేకుండా అణచివేత దోరణి ప్రదర్శించారని వారు ఆరోపించారు. గవర్నర్‌ను కలిసిన అనంతరం డాక్టర్ లక్ష్మణ్, బండారు దత్తాత్రేయ పాత్రికేయులతో మాట్లాడారు. ఆపద్ధర్మ సీఎంగా కూడా అధికార దుర్వినియోగానికి పాల్పడే అవకాశం ఉందని కనుక గవర్నర్ చొరవ తీసుకుని తగిన చర్యలు చేపట్టాలని కోరారు. ప్రజాస్వామ్యంలో ఆపద్ధర్మ ప్రభుత్వ పాత్ర చాలా పరిమతమని, గవర్నర్ చురుకుగా వ్యవహరించాలని వారు కోరారు.
ముందస్తు ఎందుకో చెప్పండి: లక్ష్మణ్
ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్తున్నారో సీఎం ప్రజలకు చెప్పాలని లక్ష్మణ్ నిలదీశారు. దీనివెనుక మతలబు ఏమిటో చెప్పాలని నిలదీశారు. తెలంగాణ రాష్ట్రం తమ రాజ్యం అయినట్టు, రాచరిక వ్యవస్థలో ఉన్నట్టుగా వ్యవహరిస్తుంటడాన్ని తెలంగాణ సమాజం గుర్తిస్తోందని కేసీఆర్‌కు తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.
అసెంబ్లీని ఎందుకు రద్దు చేశారు?: దత్తాత్రేయ
శాసనసభను రద్దు చేయడం అప్రజాస్వామికమని బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. తెలంగాణ అసెంబ్లీ రద్దుపై ఆయన మీడియాతో మాట్లాడారు. ఐదేళ్ల పాటు పాలించాలని ప్రజలు తీర్పు ఇస్తే నాలుగేళ్లకే అసెంబ్లీని ఎందుకు రద్దు చేశారని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని చేతిలో పెట్టుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు.
కుమ్మక్కు రాజకీయాలు: కిషన్‌రెడ్డి
ముస్లింలను 12 శాతం రిజర్వేషన్లు ఎందుకు అమలుచేయడం లేదని బీజేపీ నేత జీ కిషన్‌రెడ్డి సీఎం కేసీఆర్‌ను నిలదీశారు. రిజర్వేషన్ల విషయంలో మోసం చేసిన తెరాసను ఓడించాలని ఓటర్లను ఆయన కోరారు. ఎంఐఎంతో కుమ్మక్కై రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఎంఐఎంకు చెందిన ప్రైవేటు వైద్య కళాశాలకు భూమి ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. ఎంఐఎంతో బహిరంగంగా పొత్తు కుదుర్చుకోవాలన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు.

చిత్రం..రాజ్‌భవన్‌లో గురువారం గవర్నర్ నరసింహన్‌కు వినతిపత్రం సమర్పిస్తున్న బీజేపీ నాయకులు