తెలంగాణ

వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 7: రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే అపద్ధర్మ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ముందస్తు ఎన్నికలకు వెళ్ళారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కే. జానారెడ్డి విమర్శించారు. తొమ్మిది నెలల ముందే ప్రజా సంక్షేమాన్ని నిలిపి వేస్తూ తీసుకున్న నిర్ణయానికి సహేతుకమైన సమాధానం ఇప్పటికీ చెప్పలేదని అన్నారు. శుక్రవారం జానారెడ్డి తన నివాసంలో పార్టీ ముఖ్యులతో సమావేశమై తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. సమావేశానంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్లారో ప్రజలకు సమాధానం చెప్పలేదని, కనీసం మీడియా ప్రతినిధులు అడిగినా దాట వేశారని తెలిపారు. రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి నెలకొందని ఇంగ్లీషులో చెప్పిన కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వానికి అనిశ్చితి ఉందనడం వాస్తవమేనా? అని ప్రశ్నించారు. రాజకీయ అనిశ్చితికి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది కేసీఆరే కదా అని అన్నారు. టీఆర్‌ఎస్ వ్యవహరించిన తీరు ప్రజాస్వామ్యానికే చేటు అని ఆయన అన్నారు. టీఆర్‌ఎస్ తీరే బఫూన్‌లా ఉందని ఆయన విమర్శించారు.
భగ్గుమన్న కోమటిరెడ్డి
తమ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గురించి మాట్లాడే అర్హత కేసీఆర్‌కు లేదని కాంగ్రెస్ తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట రెడ్డి విమర్శించారు. దొంగ నోట్లు, దొంగ పాసు పోర్టుల్లో ఎవరున్నారని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు మంచి నీళ్లు ఇచ్చినా గుర్తు పెట్టుకుంటారు కానీ కేసీఆర్ అన్నం పెట్టిన వారికి సున్నం పెడుతున్నారని ఆయన విమర్శించారు.