తెలంగాణ

కలిసి నడుద్దాం..టీఆర్‌ఎస్‌ను ఓడిద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 7: ‘ముందస్తు ఎన్నికల్లో కలిసి పోటీ చేద్దాం...అవినీతిపరులను మట్టి కరిపిద్దాం..’ అని పీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి మిగతా విపక్షాలకు పిలుపునిచ్చారు. శుక్రవారం గాంధీ భవన్‌లో కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం జరిగింది. ఎఐసీసీ ప్రధాన కార్యదర్శి ఆర్‌సీ కుంతియా, వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క, ఇతర నాయకులు మధుయాష్కీ, వంశీచంద్ రెడ్డి, సంపత్ కుమార్, పొన్నాల లక్ష్మయ్య, వీ. హనుమంత రావు, గూడురు నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమావేశానంతరం ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ స్థాయి మరచి మాట్లాడుతున్నారని విమర్శించారు.
ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మట్లాడడం భావ్యం కాదని, అది కేసీఆర్ నీచమైన ప్రవర్శనకు నిదర్శనమని ఆయన దుయ్యబట్టారు. అవినీతి పాలనను అంతమొందించేందుకు మిగతా పార్టీలు కలిసి రావాలని ఆయన కోరారు.
10న బంద్‌లో పాల్గొనండి
అడ్డగోలుగా పెట్రోలు, డీజిల్ ధరలు పెంచుతూ పేద ప్రజలపై విపరీతమైన భారం మోపుతున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈ నెల 10న భారత్ బంద్‌కు ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
12న ఆజాద్ రాక..
ఏఐసీసీ నాయకుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ ఈ నెల 12న హైదరాబాద్‌కు రానున్నట్లు ఉత్తమ్ చెప్పారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో జరిగిన అక్రమాలపై ఆజాద్ గాంధీ భవన్‌లో విలేఖరుల సమావేశంలో మాట్లాడిన అనంతరం సంగారెడ్డికి వెళ్ళి అక్కడ మైనారిటీల సభలో ముఖ్యఅతిథిగా హాజరవుతారని ఆయన తెలిపారు. కుంతియా మాట్లాడుతూ రాహుల్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసీఆర్‌నే పెద్ద బఫూన్‌గా అభివర్ణించారు.