తెలంగాణ

రాష్ట్ర అర్హత పరీక్ష ఫలితాలు వెల్లడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 7: రాష్ట్ర అర్హత పరీక్ష (టిఎస్ సెట్) ఫలితాలను ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డి , ఉస్మానియా యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎస్ రామచంద్రం, మెంబర్ సెక్రటరీ ప్రొఫెసర్ బి యాదవరాజు విడుదల చేశారు. ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో టీఎస్ సెట్ ఫలితాలను విడుదల చేశారు. టీఎస్ సెట్ నిర్వహణ బాధ్యత ఉస్మానియా యూనివర్శిటీకి ప్రభుత్వం అప్పజెప్పిందని, 29 సబ్జెక్టుల్లో జూలై 15వ తేదీన టీఎస్ సెట్ ఐదు పట్టణాల్లో నిర్వహించామని అన్నారు. ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్, నల్గోండ, నిజామాబాద్, వరంగల్ పట్టణాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 64,994 మంది రిజిస్టర్ చేసుకున్నారని, అందులో 51,739 మంది హాజరయ్యారని, అందులో 3759 మంది అర్హత సాధించారని అన్నారు. ఉత్తీర్ణత శాతం 7.27 శాతం ఉందని పేర్కొన్నారు. ఫలితాలను విశే్లషిస్తే అన్‌రిజర్వుడ్ అభ్యర్ధులు 51739 మంది హాజరుకాగా, 1832 మంది, బీసీ -ఎ నుండి 3899 మంది హాజరుకాగా, 268 మంది అర్హత సాధించారని, బీసీ - బి నుండి 11808 మంది హాజరుకాగా, 402 మంది, బీసీ -సి నుండి 463 మంది హాజరుకాగా, 43 మంది, బీసీ డి నుండి 9659 మంది హాజరుకాగా, వారిలో 300 మంది, బీసీ ఇ నుండి 2784 మంది హాజరుకాగా, 148 మంది, ఎస్సీ నుండి 11478 మంది హాజరుకాగా, వారిలో 552 మంది, ఎస్టీ నుండి 4736 మంది హాజరుకాగా, వారిలో 234 మంది కలిపి 3759 మంది అర్హత సాధించారని పేర్కొన్నారు. బి.సి, ఎస్సీ, ఎస్టీలకు పిడబ్ల్యుడి అభ్యర్ధులకు 35 శాతం, జనరల్ అభ్యర్ధులకు 40 శాతం అర్హత మార్కులుగా ఖరారు చేసినట్టు చెప్పారు. కాగా ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి ఉపాధ్యక్షులు ప్రొఫెసర్ లింబాద్రి, ప్రొఫెసర్ వెంకటరమణ తదితరులు కూడా పాల్గొన్నారు.
ప్రశాంతంగా ప్రీ పీహెచ్‌డీ
ఉస్మానియా యూనివర్శిటీ నిర్వహించిన ప్రీ పీహెచ్‌డీ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఈ పరీక్షకు 1700 మంది రిజిస్టర్ చేసుకోగా అందులో 1520 మంది హాజరయ్యారని వీసీ ప్రొఫెసర్ ఎస్ రామచంద్రం చెప్పారు. పరీక్ష నిర్వహణ తీరును వీసీతో పాటు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సీహెచ్ గోపాలరెడ్డి, ఒఎస్‌డీ ప్రొఫెసర్ టి కిషన్ రావు, సీనియర్ అధికారులు పర్యవేక్షించారు. విద్యార్ధి సంఘాల నేతలు బంద్‌కు పిలుపునిచ్చినా విద్యార్థులు పెద్ద సంఖ్యలో ముందే కేంద్రాలకు చేరుకుని పరీక్షలు రాశారని పేర్కొన్నారు.