తెలంగాణ

తేలని బీజేపీ అభ్యర్థులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 7: తెలంగాణలో జరిగే ముందస్తు ఎన్నికలపై ఇప్పటికే బీజేపీ రాష్ట్ర నాయకత్వం మూడు మూడు పేర్లతో జాబితాలను తయారుచేసినా, అభ్యర్ధులు ఎవరనే దానిపై ఇంకా అస్పష్టత కొనసాగుతోంది. ఏ నియోజకవర్గంలో ఎవరు పోటీచేస్తారనే అంశంపై పార్టీ జాతీయ కార్యదర్శి మురళీధరరావు సైతం తనకేమీ తెలియదని, అభ్యర్ధులను జాతీయ కమిటీ ఖరారు చేస్తుందని పేర్కొన్నారు. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ పొత్తుతో బీజేపీ 45 నియోజకవర్గాల్లో పోటీ చేసింది. అందులో ఐదింటిని మాత్రమే దక్కించుకుంది. ఉప్పల్, ముషీరాబాద్, అంబర్‌పేట, ఖైరతాబాద్, గోషామహల్ నియోజకవర్గాలను బీజేపీ గెలుపొందింది. అయితే 10 నియోజకవర్గాల్లో గట్టి పోటీనే ఇచ్చింది. ఐదు చోట్ల మహిళా అభ్యర్ధులు సైతం చెప్పుకోదగిన రీతిలో పోటీపడ్డారు. ముధోల్, సిరిసిల్ల, వికారాబాద్, నకిరేకల్, వరంగల్ ఈస్టులో బీజేపీ మహిళా అభ్యర్ధులు తమ ఉనికి చాటుకున్నారు. చెన్నూరు, మంచిర్యాల, ఆదిలాబాద్, ఎల్లారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్ , నిజామాబాద్ రూరల్, కోరుట్ల, ధర్మపురి, రామగుండం, కరీంనగర్, వేములవాడ, సిద్దిపేట, అంధోల్, నర్సాపూర్, సంగారెడ్డి, దుబ్బాక, మల్కాజ్‌గిరి, పరిగి, మలక్‌పేట, కార్వాన్, యాకుత్‌పుర, మహబూబ్‌నగర్, గద్వాల్, నాగర్‌కర్నూలు, కల్వకుర్తి, షాద్‌నగర్, కొల్హాపూర్, నల్గొండ, మునుగూడు, ఆలేరు, జనగామ, వరంగల్ వెస్టు, భూపాలపల్లి, పినపాకలలో బీజేపీ అభ్యర్ధులు పోటీ చేశారు. అయితే ఈసారి అన్ని స్థానాలకు పోటీచేస్తామని పార్టీ పెద్దలు చెబుతున్నా కనీసం 90 స్థానాలకు పోటీ చేయాలని రాష్ట్ర నాయకత్వం యోచిస్తోంది.
అసలు ఎన్ని స్థానాలకు పోటీ చేయాలనే అంశంపై నిర్ధిష్టమైన ఆలోచనకు వస్తే అపుడు అభ్యర్ధులను ఖరారు చేసేందుకు వీలు కలుగుతుందని పార్టీ నేతలు చెబుతున్నారు. 15వ తేదీన పార్టీ జాతీయ అధ్యక్షుడు రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో అభ్యర్ధుల వ్యవహారంపై స్పష్టత వస్తుందని చెబుతున్నారు. కాంగ్రెస్, టీడీపీలు తెలంగాణలో పొత్తు కుదుర్చుకుంటే జనసేన వంటి పార్టీలు ముందుకు వచ్చి బీజేపీకి మద్దతు ఇచ్చే అవకాశం ఉందా అనే కోణంలో పార్టీ నేతలు పరిశీలిస్తున్నారు.
సీఎం నిజాలు మాట్లాడాలి: కిషన్‌రెడ్డి
సీఎం కేసీఆర్ ఇప్పటికైనా నిజాలు మాట్లాడాలని పార్టీ నేత జీ కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. నవంబర్‌లో ఎన్నికలు వస్తాయని కేసీఆర్ చెప్పిన మాటలకు, భారత ఎన్నికల కమిషన్ చెప్పిన మాటలకు పొంతన లేదని అన్నారు. పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఎవరో జ్యోతిష్యం చెబితే వాటిని అనుసరించడం తమ పనికాదన్నట్టు ఎన్నికల ప్రధాన అధికారి పేర్కొన్నారని చెప్పారు. బీజేపీ ఎవరి చేరికల కోసం ప్రయత్నాలు చేయడం లేదని అన్నారు.
బీజేపీ లేకుండా టీడీపీ ఎన్నడూ గెలవలేదని ఆయన చెప్పారు. బీజేపీ భుజాలపై తుపాకీ పెట్టి ముస్లింల ఓట్లు దండుకోవాలని కేసీఆర్ చూస్తున్నారని, బీజేపీ మతతత్వ పార్టీ అని కేసీఆర్ అంటున్నారని , బహిరంగ చర్చకు టీఆర్‌ఎస్ సిద్ధమా అని నిలదీశారు. టీఆర్‌ఎస్‌కు ప్రజలు మద్దతు ఉంటే ఇతర పార్టీల నేతలను ఎందుకు చేర్చుకుంటున్నారో చెప్పాలని అన్నారు. బీజేపీని విమర్శించే హక్కు కేసీఆర్‌కు లేదని అన్నారు.