తెలంగాణ

పొత్తుల బాటలో కమ్యూనిస్టులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, సెప్టెంబర్ 9: ముందస్తు ఎన్నికల పోరులో సైతం వామపక్షాలు మరోసారి పొత్తుల బాటలోనే సాగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కలిసివచ్చే పార్టీలు, సామాజిక, ప్రజా సంఘాలతో పొత్తులు, సీట్ల సర్దుబాట్లతో ఎన్నికల్లో తెలంగాణలో తమ ఉనికి చాటుకుని తెలంగాణ రాష్ట్రం రెండో అసెంబ్లీలో మెరుగైన స్థానాలతో అడుగు పెట్టాలని సీపీఐ, సీపీఎంలు భావిస్తున్నాయి. గతంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా కమ్యూనిస్టుల ఖిల్లాగా కొనసాగగా తదుపరి కాంగ్రెస్, టీడీపీ, టీఆర్‌ఎస్‌ల ధాటికి క్రమంగా వామపక్ష పార్టీలు జిల్లాలో బలహీనపడ్డాయి. స్వరాష్ట్రంలో గత నాలుగేళ్లుగా సీపీఐ, సీపీఎంలు పెద్ద ఎత్తున ప్రజాసమస్యలపై పాదయాత్రలు, పోరుయాత్రలతో అనుబంధ సంఘాల బలోపేతంతో ప్రజాధరణ పొందేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నించాయి. సీపీఎం ఒక అడుగు ముందుకేసి రాజకీయ మార్పు, సామాజిక న్యాయం కోరుతు బీఎల్‌ఎఫ్‌ను స్థాపించి బడుగు, బలహీన వర్గాలు, దళితులు, వామపక్ష ప్రజాతంత్ర శక్తులతో కలిపి ఎన్నికల దిశగా గట్టి కసరత్తే చేసింది. సీపీఐ ఒంటరిగానే తన ప్రజా ఉద్యమాల పోరాట ప్రస్థానం సాగించింది. ఇంతలోనే తొమ్మిది నెలల ముందుగానే తెలంగాణ అసెంబ్లీ రద్దు జరిగి ముందస్తు ఎన్నికలు ముంచుకురావడంతో ఆకస్మికంగా ఇతర ప్రతిపక్షాల తరహాలోనే వామపక్షాలు సైతం ఎన్నికల తీరం దాటడంలో అపసోపలు పడుతున్నాయి.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీఎల్‌ఎఫ్ ద్వారా అన్ని స్థానాల్లో పోటీ చేయాలని సీపీఎం భావించగా ముందస్తు ఎన్నికల నేపధ్యంలో ఆ పార్టీ సైతం పొత్తుల దిశగా కూడా ఆలోఛన చేస్తుంది. ప్రస్తుతానికి బీఎల్‌ఎఫ్ గొడుగు కిందనే మంద కృష్ణ, ఆర్.కృష్ణయ్య, గద్దర్‌లతో కలిసి అన్ని స్థానాల్లో పోటీ చేయాలని సీపీఎం కసరత్తు చేస్తుంది. బిసి ముఖ్యమంత్రి, మహిళా ఉప ముఖ్యమంత్రి, సామాజిక న్యాయం ఎజెండాగా సీపీఎం ఇప్పటికే బీఎల్‌ఎఫ్ ఎన్నికల ప్రణాళికను సైతం విడుదల చేసింది.
బీఎల్‌ఎఫ్ నుండి గద్దర్‌ను నల్లగొండ, భువనగిరిలలో లేదా సింగరేణి కార్మికుల ప్రాబల్య నియోజకవర్గాల నుండి ఎన్నికల బరిలోకి దించాలని సీపీఎం నాయకత్వం ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈనెల 15, 16తేదిల్లో కామారెడ్డిలో నిర్వహించనున్న సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశంలో ముందస్తు ఎన్నికల్లో సీపీఎం పార్టీ వ్యూహం ఖరారు చేయనున్నట్లుగా ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇతర పార్టీలతో సీపీఎం పొత్తు పెట్టుకుంటే మాత్రం మిర్యాలగూడ, భువనగిరి, నల్లగొండ స్థానాలను కోరే అవకాశముంది.
ఇక సీపీఐ పొత్తుల బాటలో ముందుండగా ఆ పార్టీ జిల్లాలోని దేవరకొండ, మునుగోడు స్థానాలను కోరుకుంటుంది. అదే జరిగితే ఇక్కడ కాంగ్రెస్, టిడిపి అభ్యర్థుల ఆశలు గల్లంతయ్యే అవకాశం కనిపిస్తుంది. పొత్తులు, సీట్ల సర్ధుబాటులో సీపీఐ అటు కాంగ్రెస్, టిడిపిలతో ఇటు టిజెఎస్‌తో సైతం చర్చోపచర్చలు సాగిస్తుండటం ఆసక్తికరం.