తెలంగాణ

ముందస్తు ఎన్నికలకు జిల్లా యంత్రాంగం సన్నద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గద్వాల, సెప్టెంబర్ 9: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ఎన్నికల దిశగా అడుగులు వేస్తుండడంతో అంతేస్థాయిలో ఎన్నికలకు జిల్లా అధికార యంత్రాంగం సర్వసన్నద్ధవౌతుంది. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు వాడే ఈవీఎం, వీవీ టాక్ సామాగ్రిని భద్రపర్చుటకు స్థల నిర్దేశన జరిగిందని జిల్లా కలెక్టర్ శశాంక తెలిపారు. ఆదివారం గద్వాల సమీపంలోని బీరెల్లి రోడ్డులో కొత్తగా నిర్మించిన మహిళా డిగ్రీ కళాశాలను, వ్యవసాయ మార్కెట్‌యార్డులో గల గోదాములను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈవీఎంలను భద్రపర్చుటకు ఈ రెండింటిలో ఏదో ఒకదాన్ని ఎంపిక చేస్తామని తెలిపారు. జోగుళాంబ గద్వాల జిల్లాలోని గద్వాల, అలంపూర్ నియోజకవర్గాలకు చెందిన మహిళా, పురుష ఓటర్లు మొత్తం 4,15,871 మంది ఉన్నారని, సర్వీస్ ఓటర్లు 44 మంది ఉన్నారని తెలిపారు. వెంట జాయింట్ కలెక్టర్ నిరంజన్, ఆర్డీవో రామునాయక్, తహశీల్దార్ ఉన్నారు.

చిత్రం..ఈవీఎంలు భద్రపరిచే గదులను పరిశీలిస్తున్న గద్వాల కలెక్టర్ శశాంక