తెలంగాణ

అభివృద్ధికే పట్టం కట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్‌టౌన్, సెప్టెంబర్ 9: నియోజకవర్గంలో నాలుగేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధికి ప్రజలు పట్టం కట్టాలని మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఆదివారం పట్టణంలోని 37వ వార్డులోని పార్కులో మొక్కలు నాటే కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ గత ప్రభుత్వాల హయంలో జరగని అభివృద్ధిని ప్రస్తుతం ప్రజలు చూస్తున్నారని వచ్చే ఎన్నికల్లో తెరాసకు అధికారం కల్పిస్తే నియోజకవర్గాన్ని హైదరాబాద్ తరహాలో తీర్చిదిద్దుతానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గత పాలకులు హామీలు తప్పా. చేసింది ఏమీ లేదని తాము అధికారంలోకి వచ్చాక ఎన్నికల మ్యానిఫెస్టోలో ఉంచిన హామీలను ఆమలు చేసి ప్రజలకు అందుబాటులో తెచ్చామని దాంతో ప్రజలు ఆర్థికంగా బలోపేతం చేయడం జరిగిందన్నారు. కళాకారుల సంఘం ఆధ్వర్యంలో సంగీత నాటకరంగ అకాడమి చైర్మన్‌గా టీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాద్మి శివకుమార్ నియమితులైన సందర్భంగా నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డిలు కలిసి సన్మానించారు. అదేవిధంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబ్‌నగర్ పట్టణంలోని తెలంగాణ కాలనీలో మున్సిపల్ చైర్ పర్సన్ రాధ ఆమర్, వైస్ చైర్మన్ రాములుతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు.