తెలంగాణ

వీసీ కోసం పోటాపోటీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 25: రాష్ట్రంలో తొమ్మిది వర్శిటీల్లో వైస్ ఛాన్సలర్ల నియామకానికి ఇంతవరకూ 208 దరఖాస్తులు వచ్చినట్టు తెలిసింది. జనవరి 8 వరకూ దరఖాస్తు గడువున్నా, దాన్ని మరికొంత కాలం పొడిగించే అవకాశం ఉంది. పదిమంది ప్రొఫెసర్లు ఐదారు వర్శిటీలకు వేర్వేరుగా దరఖాస్తులు సమర్పించారు. వైస్ ఛాన్సలర్ల నియామకానికి సంబంధించి ఇంతవరకూ ఉమ్మడి రాష్ట్రంలోవున్న నిబంధనలను ఇటీవలే తెలంగాణ సవరించింది. గతంలో సెర్చి కమిటీలు పరిశీలించి రెండు మూడు పేర్లు సూచిస్తే అందులో ఒక పేరు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తూ గవర్నర్‌కు పంపించేది. ఛాన్సలర్ హోదాలో గవర్నర్ ఆ పేరును ఆమోదించేవారు. కొన్ని సందర్భాల్లో గవర్నర్ తిరస్కరించి మరో మూడు పేర్లతో నామినేషన్లు పంపించమని అడిగిన సందర్భాలూ ఉన్నాయి. అయితే ఈసారి తెలంగాణలో గవర్నర్ ప్రమేయాన్ని తొలగించిన ప్రభుత్వం సిఎంకు ప్రత్యక్షంగా కట్టబెట్టింది. గతంలోనూ సిఎంలు అనధికారికంగా సూచించిన పేర్లనే గవర్నర్లు ఆమోదించినా, నేడు నేరుగా సిఎం వైస్ ఛాన్సలర్లను ఎంపిక చేసే అవకాశం దక్కింది. అంతే కాదు, ప్రతి వర్శిటీకీ ఛాన్సలర్లను సైతం ప్రభుత్వం నియమించే వీలు కూడా ఉంది. తెలంగాణలో ఉస్మానియా యూనివర్శిటీ, కాకతీయ యూనివర్శిటీ, శాతవాహన యూనివర్శిటీ, తెలంగాణ యూనివర్శిటీ, పాలమూరు యూనివర్శిటీ, మహాత్మాగాంధీ యూనివర్శిటీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్శిటీ, జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజీకల్ యూనివర్శిటీలకు కొత్త విసిలను నియమించనున్నారు. దీనికి ఉతృష్టమైన విద్యావేత్తలను మాత్రమే దరఖాస్తు చేయమని ప్రభుత్వం సూచించింది. గతంలో కనీసం 10నుంచి 20 ఏళ్లు ప్రొఫెసర్లుగా పనిచేసిన వారు మాత్రమే విసిలుగా దరఖాస్తు
చేసేందుకు అర్హులుగా ఉండేవారు. ఎన్నో అర్హతలున్నా, విసిల పోస్టుకు దరఖాస్తు చేసేందుకు సైతం వెనుకంజ వేసేవారు. కానీ నేడు ఐదేళ్లు సర్వీసు చేసినవారు సైతం అర్హులేనని చెప్పడంతో ప్రతి ఒక్కరూ బయోడాటాలు పంపుతున్నారని తెలిసింది. ప్రభుత్వం 35 అంశాలతో కూడిన నమూనా దరఖాస్తును రూపొందించింది. ఆ దరఖాస్తులో సమర్పించే సమాచారంతో ఈనెల రెండోవారంలో ఒక జాబితా సమర్పించి సిఎం కార్యాలయానికి సమర్పిస్తారని సమాచారం. జిహెచ్‌ఎంసి ఎన్నికల కోడ్ నెలాఖరు వరకూ ఉన్నందున, ఎన్నికల వ్యవహారం ముగిసిన వెంటనే ఫిబ్రవరి మొదటివారంలో నియామకాలు చేపట్టనున్నట్టు సమాచారం.