తెలంగాణ

గుండెపోటుతో మాజీ ఎంపి కల్పనాదేవి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, మే 29: వరంగల్ పార్లమెంటు మాజీ సభ్యురాలు డాక్టర్ టి. కల్పనాదేవి ఆదివారం తెల్లవారు జా మున గుండెపోటుతో మృతి చెందా రు. గత కొన్ని రోజులుగా అనారోగ్యం తో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె రాత్రి 2గంటలకు మరణించారు. ఈ సంఘటన తెలుసుకున్న డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి, టిపిసిసి మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య హుటాహుటీన అక్కడకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు సంతాపం వ్యక్తం చేశారు. మాజీ పార్లమెంటు సభ్యురాలు కల్పనాదేవి టిడిపి నుండి రెండు సార్లు వరంగల్ పార్లమెంటు సభ్యురాలిగా గెలుపొందారు.
సింగరేణికి జాతీయ అవార్డు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మే 29: సింగరేణి సంస్థ ‘ఎక్సెలెన్స్ ఇన్ కాస్ట్ మేనేజ్‌మెంట్-2015’ జాతీయ అవార్డును కైవసం చేసుకుంది. భారీ మైనింగ్ పరిశ్రమల విభాగంలో కాస్ట్ మేనేజ్‌మెంట్‌లో అత్యుత్తమ కంపెనీగా ఎంపికైన నేపథ్యంలో శనివారం సాయంత్రం న్యూఢిల్లీలోని హోటల్ అశోకాలో జరిగిన ఓ కార్యక్రమంలో సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ శ్రీ్ధర్ ఈ అవార్డును సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ చైర్మన్ నజీబ్ షా చేతుల మీదుగా అందుకున్నారు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా సంస్థ ప్రతి సంవత్సరం అత్యుత్తమ, గుణాత్మకమైన కాస్ట్ మేనేజ్‌మెంట్ పద్దతులను అలంబించే పరిశ్రమలకు గుర్తింపునిస్తూ ఈ అవార్డులను అందజేస్తోంది. మైనింగ్ విభాగంలో పబ్లిక్ సెక్టార్ భారీ పరిశ్రమల కేటగిరీలో సింగరేణికి ఈ అరుదైన గౌరవం దక్కింది.