తెలంగాణ

టీఆర్‌ఎస్‌ను తరిమికొట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గద్వాల, సెప్టెంబర్ 9: ఎన్నో ఏళ్లుగా విద్యార్థులు, ఉద్యమకారులు, మేధావులు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి తెలంగాణ కోసం పాటుపడితే ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షను, ఆత్మగౌరవాన్ని గౌరవించి సోనియాగాంధీ ప్రత్యేక రాష్ట్రాన్ని కేటాయించిందని, అన్ని వర్గాల ప్రజలను ముంచిన దగాకోరు టీఆర్‌ఎస్‌ను తరిమికొట్టాలని గద్వాల తాజా మాజీ ఎమ్మెల్యే డీకే అరుణ పిలుపునిచ్చారు. ఆదివారం గద్వాలలోని డీకే సత్యారెడ్డి బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ నిధులు, నీళ్లు, నియామకాలు, ఆత్మగౌరవం పేరిట అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం ఏ ఒక్క రంగాన్ని కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసిందని దుయ్యబట్టారు. ఉద్యమంలో పని చేసిన నేతలను పక్కనపెట్టి తన స్వలాభం కోసం ఉద్యమ ద్రోహులను చేర్చుకొని తెలంగాణ ప్రజలను నట్టేట ముంచారని అన్నారు. ఎన్నికల సంబంధంగా ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలుపర్చని టీఆర్‌ఎస్‌ను ప్రజలు తరిమికొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగులకు ఐఆర్‌పీఆర్‌సీ, ఇంటింటికి నల్లా నీళ్లు ఇవ్వకుంటే ఓట్లు అడగనని చెప్పిన మీరు నీరివ్వకుండా ఓట్లు అడిగే అర్హత ఎక్కడిదని ప్రశ్నించారు. మిగులు బడ్జెట్‌తో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చి దివాలా తీయించారని, కుటుంబం మాత్రం కోట్లాది రూపాయలు కూడగట్టుకొని సంపన్నులు అయ్యారని ఆరోపించారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, టీఆర్‌ఎస్ అవినీతి భాగోతాన్ని బట్టబయలు చేస్తామన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెంచడంతో పాటు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ సోమవారం దేశవ్యాప్తంగా తలపెట్టిన భారత్‌బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జోగుళాంబ గద్వాల జిల్లాలోని అన్ని వ్యాపార, వాణిజ్య, ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల వారు బంద్‌కు మద్దతు తెలిపిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును నిరసించాలని సూచించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ కృష్ణవేణి, పీసీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గడ్డం కృష్ణారెడ్డి, రామేశ్వర్‌రెడ్డి, బంగి సుదర్శన్, కుర్వపల్లి కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న డీకే అరుణ