తెలంగాణ

దాదాపు ఖరారైన బీజేపీ అభ్యర్థుల జాబితా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 10: తెలంగాణ బీజేపీ అభ్యర్ధుల జాబితా తుది రూపానికి చేరుకుంది. ఇటీవల రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్‌తో పాటు పలువురు సీనియర్ నేతలు ఢిల్లీకి వెళ్లి జాతీయ స్థాయి నాయకులతో పెద్ద ఎత్తున కసరత్తు చేసిన తర్వాత జాబితా ఒక స్వరూపానికి వచ్చింది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకూ పోటీ చేయాలనే ఆలోచనను రాష్ట్ర నాయకులు వ్యక్తం చేసినా, దాదాపు 90 స్థానాలకు బీజేపీ అభ్యర్ధులను రంగంలోకి దించనున్నట్టు తెలిసింది. మరో పక్క కేంద్ర మానవ వనరుల మంత్రి, గతంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా పనిచేసిన ప్రకాష్ జవదేకర్ రాష్ట్రానికి వస్తున్నారు. ఆయనతో కూడా రాష్ట్రా నాయకులు హైదరాబాద్‌లో భేటీ కానున్నారు. మరో పక్క ఎన్నికల ప్రచారానికి కూడా పార్టీ సన్నద్ధమవుతోంది. కనీసం రెండు నియోజకవర్గాలకు ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయాలని, ఆ బహిరంగ సభలో బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, సీనియర్ నాయకులను రంగంలోకి దించడంతో పాటు రాష్ట్రానికి చెందిన సీనియర్ నేతలతో ప్రసంగాలను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల ప్రచార సామగ్రీని పార్టీ సిద్ధం చేస్తోంది. తొలి దశలో కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలు, వివిధ పథకాలు, రాష్ట్రానికి కేటాయించిన నిధులు, ప్రాజెక్టులను వివరించే కరపత్రాలను సిద్ధం చేశారు. వాటిని అన్ని నియోజకవర్గాల ఇన్‌ఛార్జిలకు అందజేస్తున్నారు. ఇంకో పక్క ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పనలో పార్టీ సీనియర్ నేత ప్రొఫెసర్ శేషగిరిరావు నిమగ్నమయ్యారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల ఎన్నికల మేనిఫెస్టోలతో సంబంధం లేకుండానే ఈసారి విభిన్నంగా బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టోను రూపొందిస్తోంది. ఈ నెల 15వ తేదీన రాష్ట్ర ఎన్నికల సమరభేరిని జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మోగించనున్నారు. దాంతో ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేయాలని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఈసారి సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయను సనత్‌నగర్ నుండి, ఎమ్మెల్సీ రామచందర్‌రావును మల్కాజ్‌గిరి నియోజకవర్గం నుండి బరిలో దించనున్నట్టు సమాచారం. వీరితో పాటు సిట్టింగ్ స్థానాల్లో అంబర్‌పేట నుండి కిషన్‌రెడ్డిని, గోషామహల్ నుండి రాజాసింగ్‌ను, ముషీరాబాద్ నుండి డాక్టర్ లక్ష్మణ్, ఖైరతాబాద్ నుండి రామచంద్రారెడ్డి, ఉప్పల్ నుండి ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్‌లే మళ్లీ పోటీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మిగిలిన చోట్ల కాస్తా ఆర్ధిక సామర్ధ్యాలున్న వారినే అభ్యర్ధులుగా దించాలని పార్టీ యోచిస్తోంది.