తెలంగాణ

పెట్రో ఆదాయంలో 42 శాతం రాష్ట్రాలకే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 10: పెరుగుతున్న పెట్రోలు, డీజిల్ ధరలపై ప్రజలు ఆందోళనలో ఉన్నారని, అది వాస్తవమే అయినా ఈ ధరలకు కేంద్ర ప్రభుత్వం మాత్రమే కారణం కాదని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎనుగుల రాకేష్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. భారత్ బంద్‌కు పిలుపునిచ్చి కాంగ్రెస్, మిగిలిన పక్షాలు రాజకీయం చేస్తున్నాయని , దేశంలో బంద్ ఛాయలు లేవని, బంద్ సంపూర్ణంగా ఫ్లాప్ అయిందని ఆయన పేర్కొన్నారు. సోమవారం నాడు ఆయన పార్టీ కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడారు. 2014లో మన్మోహన్‌సింగ్ ప్రభుత్వం ధరల నియంత్రణను సడలించే వ్యవస్థను తీసుకువచ్చిన తర్వాత దేశంలో చమురు ధరలు అంతర్జాతీయ ధరల ప్రకారం పెరగడం, తగ్గడం జరుగుతోందని, ఇరాన్‌పైన అమెరికా విధించిన ఆంక్షలు, వెనుజులా సంక్షోభం చమలురు ఉత్పత్తి దేశాలు గతంలో నిర్ణయించినట్టుగా చమురు ఉత్పత్తిని పెంచకపోవడం వంటి కారణాల వల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతున్నాయని అన్నారు. దానికి తగ్గట్టు దేశంలో కూడా పెట్రోలు, డీజిల్ ధరలు పెరుగుతున్నాయని అన్నారు. యూపీఏ ప్రభుత్వం బాధ్యత లేకుండా 1.50 లక్షల కోట్ల విలువైన బాండ్లు విడుదల చేయడం వల్ల ఈ రోజు మోడీ ప్రభఉత్వం 50వేల కోట్ల వడ్డీతో కలిపి మొత్తం రెండు లక్షల కోట్ల రూపాయిల అప్పును చెల్లించాల్సి వస్తోందని అన్నారు. వారి పాపాలను తాము ప్రక్షాళన చేయాల్సి వస్తోందని చెప్పారు. వాస్తవానికి ఎక్సైజ్ కారణంగా కేంద్రం సమకూర్చుకునే ఆదాయం లీటర్ పెట్రోల్‌పై 12 రూపాయిలు ఉంటుందని, కానీ రాష్ట్రాలు దండుకునేది మాత్రం దానికి రెట్టింపుగా 24 రూపాయిలని వివరించారు. 24 రూపాయిలు తీసుకుంటున్న రాష్ట్రాలకు ధరలను నియంత్రించే బాధ్యత లేదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్, టీడీపీ, తెరాస పార్టీల నాయకులకు బీజేపీని విమర్శించే అర్హత లేదని అన్నారు. ప్రజల మీద భారం తగ్గించాలని కేంద్రం అక్టోబర్‌లో రెండు రూపాయిల ఎక్సైజ్ పన్నును తగ్గించి వ్యాట్ తగ్గించమని పిలుపు ఇస్తే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు తగ్గించినా, తెలుగు రాష్ట్రాల్లో తగ్గించలేదని అన్నారు. 2004లో లీటర్ పెట్రోలు ధర 35 రూపాయిలు ఉందని, 2014 నాటికి అది 72 రూపాయిలు అయిందని, 2018లో 83 రూపాయిలకు చేరిందని చెప్పారు. జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశాల్లో పెట్రో ధరలపై కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఎందుకు ప్రస్తావన తీసుకురావడం లేదని ఆయన నిలదీశారు. చమురు ధరలను కట్టడి చేయడానికి కేంద్రప్రభుత్వం సౌరవిద్యుత్‌ను, ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తోందని, పెట్రోల్ డీజిల్‌ను జీఎస్‌టీలోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోందని, చమురు ఎగుమతి చేసే దేశాలతో సంప్రదింపులు జరుగుతున్నాయని అన్నారు. దీనిని అంతా గమనించాలని ఆయన సూచించారు. టీడీపీ, టీఆర్‌ఎస్‌లు నాలుగు రూపాయిలు వ్యాట్ తగ్గించిన తర్వాతనే ధరలపై మాట్లాడాలని పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడానికి అభ్యంతరం లేదని రెండు పార్టీలూ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.