తెలంగాణ

రాష్ట్రానికి రానున్న ఈసీ బృందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు వీలైనంత త్వరగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ వేగంగా చర్యలు చేపట్టింది. శాసనసభ రద్దయిన రెండో రోజు నుండే అధికారికంగా ఎన్నికల కార్యక్రమం ప్రారంభమైంది. ఓటర్ల జాబితా సవరణను రెండు నెలలు ముందుగానే పూర్తి చేసేందుకు ఈ నెల ఏడోతేదీననే ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్లపై చర్చించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ (సీఈసీ) హైదరాబాద్‌లోని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ రజత్ కుమార్‌ను సోమవారమే ఢిల్లీకి పిలిపించుకుని చర్చించింది. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓ.పి. రావత్‌తో పాటు ఎన్నికల కమిషన్‌లో పనిచేస్తున్న ఉన్నతాధికారులతో రజత్ కుమార్ సోమవారం దాదాపు ఐదు గంటలపాటు చర్చించారు.
రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించేందుకు గల పరిస్థితిని అంచనావేసేందుకు ఉన్నతస్థాయి బృందాన్ని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ మంగళవారమే హైదరాబాద్ పంపిస్తున్నారు. సీఈసీలో డిప్యూటీ కమిషనర్‌గా పనిచేస్తున్న ఉమేష్ సిన్హా నేతృత్వంలో తొమ్మిది మంది బృందం మంగళవారం హైదరాబాద్ వస్తోంది. ఈ బృందం హైదరాబాద్ రాగానే తొలుత రాష్టస్థ్రాయి ఉన్నతాధికారులతో చర్చిస్తారు. మంగళవారం సాయంత్రం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమవుతున్నారు. ఇందుకోసం మినట్ టు మినట్ కార్యక్రమం ఖరారైంది. సాయంత్రం 6.30 నుండి 8 గంటల వరకు అఖిలపక్ష సమావేశం జరుగుతుంది. టీఆర్‌ఎస్, కాంగ్రెస్, టీడీపీ, బీజేపి, ఎంఐఎం, సీపీఐ, సీపీఎం, బీఎస్‌పి, వైకాప ప్రతినిధులతో ఉన్నతస్థాయి బృందం చర్చిస్తుంది.
రాజకీయ పార్టీల అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఒక్కో పార్టీకి పదేసి నిమిషాల గడువు ఇస్తున్నారు. పదినిమిషాలకంటే ఒక్క నిమిషం కూడా ఎక్కువ ఇవ్వకూడదని నిర్ణయించారు. ఈ పదినిమిషాల్లోనే ఆ యా రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలను స్పష్టం చేయాల్సి ఉంటుంది. కేంద్రం బృంద ఈ నెల 12న జిల్లా కలెక్టర్లు, ఎస్‌పీలతో సమావేశమవుతారు. పోలింగ్ నిర్వహణకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉన్నాయా అన్న అంశంపై వివరాలు తెలుసుకుంటారు. శాంతి, భద్రతల పరిస్థితిపై లోతుగా చర్చిస్తారు. ఆ యా జిల్లాలకు అవసరమైన ఎలక్ట్రానికి ఓటింగ్ మెషిన్లు, వివిప్యాట్‌లు, ఇతర సామాగ్రి ఎంత అవసరం అవుతుందో లిఖితపూర్వకంగా తీసుకుంటారు. పోలింగ్ నిర్వహణకు సిబ్బంది నియామకం, వౌలిక సదుపాయాలు ఎలా ఉన్నాయో పరిశీలిస్తారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నారు.
సీఎస్ వీడియో కాన్ఫరెన్స్
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్‌కే జోషి సోమవారం జిల్లా యంత్రాంగాలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బంది సిద్ధంగా ఉండేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కలెక్టర్లను ఆదేశించారు. జిల్లాలకు అవసరమైన మేరకు నిధులు అందిస్తామని, నిధులకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. కంప్యూటర్లను ఏర్పాటు చేసుకోవడం వీటి నిర్వహణకు సాంకేతిక సిబ్బందిని నియమించుకోవడం వెంటనే చేయాలని ఆదేశించారు. పోలింగ్ స్టేషన్లన్నీ సవ్యంగా ఉండేలా చూసుకోవాలని, పోలింగ్ రోజు ప్రకృతివైపరీత్యాలు వచ్చినా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పోలింగ్ నిర్వహణ సమయంలో శాంతిభద్రతలు సజావుగా ఉండేలా చూడాలని ఎస్‌పీలను ఆదేశించారు. ఈ నెల 12 హైదరాబాద్‌లో జరిగే సమావేశానికి వచ్చే సమయానికి ప్రతి జిల్లాకు సంబంధించి సమగ్ర నివేదికలు తీసుకురావాలని కలెక్టర్లు, ఎస్‌పీలను జోషి ఆదేశించారు. రెండురోజుల క్రితమే సీఈఓ రజత్ కుమార్ కూడా జిల్లా యంత్రాంగాలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సంగతి విధితమే.
ముసాయిదా జాబితాల వెల్లడి
2019 జనవరి వరకు కొనసాగే సాధారణ ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్‌ను కేంధ్ర ఎన్నికల కమిషన్ (సీఈసీ) రద్దుచేసింది. ఓటర్ల జాబితా సవరణకు మెరుపువేగంతో షెడ్యూల్‌ను రెండురోజుల క్రితమే ప్రకటించింది. కొత్త షెడ్యూల్ ప్రకారం సోమవారమే ముసాయిదా ఓటర్ల జాబితాలను ప్రకటించారు. కొత్తగా ఓటర్ల నమోదుతో పాటు పాత ఓటర్‌కార్డుల్లో ఏవైనా మార్పులు చేర్పులు అవసరం అయితే చేసేందుకు గడువు ఈ నెల 25 వరకు ఇచ్చారు. అక్టోబర్ 8 న తుది ఓటర్ల జాబితాలను ప్రకటిస్తారు.