తెలంగాణ

రాజ్యసభకు నేడు నామినేషన్ల దాఖలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 30: తెలంగాణలో రెండు, ఆంధ్రలో నాలుగు రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులు మంగళవారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు. నామినేషన్ల దాఖలుకు రెండు రాష్ట్రాల్లోనూ మంగళవారం చివరి రోజు. తెలంగాణలో పోటీలేకుండా ఇప్పటికే ఎన్నికలు ఏకగ్రీవమని తేలిపోయింది. తెలంగాణలోని రెండు స్థానాలనూ తెరాస అభ్యర్థులు ధర్మపురి శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంతరావు కైవసం చేసుకోనున్నారు. తెరాస అభ్యర్థులు డి శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇద్దరూ మంగళవారం ఉదయం 11 గంటలకు నామినేషన్లు దాఖలు చేస్తారని తెరాస రాజ్యసభ ఎన్నికల వ్యవహారాలు చూస్తున్న మంత్రులు ఈటల రాజేందర్, నాయిని నర్సింహ్మారెడ్డి సోమవారం శాసన సభాపక్షం కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో తెలిపారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు నామినేషన్ల దాఖలు కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. తెరాస తరఫున సిఎం కెసిఆర్ సరైన అభ్యర్థులను ఎంపిక చేశారన్నారు. రాష్ట్రంలో తెరాసకు వినా మరే రాజకీయ పార్టీకి అభ్యర్థిని నిలిపేంత బలం లేదని నాయిని అన్నారు. సంఖ్యాబలం లేనందున పోటీకి దూరంగా ఉండాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది. దీంతో తెరాస అభ్యర్థులు ఇద్దరూ ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి మార్గం సుగమమైంది. తెరాస ఆవిర్భావం నుంచి కెప్టెన్ లక్ష్మీకాంతరావు పార్టీలో ఉన్నారని, 2004లో మంత్రిగా కూడా పని చేశారని తెలిపారు. రెండు రాజ్యసభ స్థానాలకు ఏకగ్రీవ ఎన్నిక జరిగేట్టుగా అన్ని పార్టీలు సహకరించాలని ఈటల రాజేందర్ కోరారు. ఇదిలావుంటే, తెరాస అభ్యర్థి కెప్టెన్ లక్ష్మీకాంతరావు సోమవారం సిఎం కెసిఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
ఎంఐఎం మద్దతు
తెరాస అభ్యర్థుల నామినేషన్ల దాఖలులో మిత్రపక్షంగా ఎంఐఎం సభ్యులు సైతం హాజరవుతారని ఈటల తెలిపారు. ఎంఐఎం ఎమ్మెల్యేలతో ఈటల రాజేందర్, నాయిని నర్సింహ్మారెడ్డి సమావేశమయ్యారు. ఎంఐఎం ఎంపి అసదుద్దీన్ ఓవైసి, ఆ పార్టీ ఎమ్మెల్యేలతో మంత్రులు సమావేశమయ్యారు.