తెలంగాణ

ఉద్యమ ఆకాంక్షలకు విరుద్ధంగా టీజేఎస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, సెస్టెంబర్ 10: ఉద్యమ ఆకాంక్షలను నెరవేరుస్తామని ప్రజల్లోకి వచ్చిన తెలంగాణ జన సమితి (టీజేఎస్) పార్టీని వ్యాపార సంస్థలా మార్చారని ఆ పార్టీ అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేసిన జ్యోత్స్న ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఆమె విలేఖరులతో మాట్లాడుతూ ప్రత్యామ్నాయ రాజకీయాలు, డబ్బు ప్రమేయం లేకుండా పార్టీ నడుస్తుందని భావించి తాను టీజేఎస్‌లో చేరినట్టు చెప్పారు. ఎన్నికల సమీపిస్తున్న వేళ పార్టీలో వసూలు రాజాలు పెరిగిపోతున్నారని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌కుమార్‌కు 2 లక్షలు ఇచ్చానని, ఆయన నుంచి తీవ్రమైన వేధింపులకు గురవుతున్నట్టు చెప్పారు. అంబర్‌పేట సత్యం గౌడ్‌తో ఫోన్‌లు చేయించి చంపేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పార్టీ టికెట్ కావాలా వద్దా...?, సత్యంగౌడ్ 4 కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. దిలీప్‌కుమార్‌కు సవాల్ విసురుతున్నా, ప్రెస్‌క్లబ్ వేదికగా బహిరంగ చర్చకు సిద్దమని జ్యోత్స్న ప్రెకటించారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలు తీవ్రంగా కలిచివేశాయని, దీంతో తాను పార్టీకి రాజీనామా చేసినట్టు ప్రకటించారు. పార్టీలో జరుగుతున్న ఈ వ్యవహారం కోదండరామ్‌కు పూర్తిగా తెలిసి ఉండవక పోవ్చని ఆమె అభిప్రాయపడ్డారు.