తెలంగాణ

గ్రామీణాభివృద్ధి శాఖకు కేంద్రం అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 10: తెలంగాణ గ్రామీణాభివృద్ధి శాఖకు కేంద్ర ప్రభుత్వం ఉత్తమ అవార్డును ప్రకటించింది. రూర్బన్ పథకాన్ని సమర్థతగా అమలు చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ మూడోస్థానంలో నిలవడంతో ఈ అవార్డును కేంద్ర గ్రామీణాభావృద్ధి శాఖ ప్రకటించింది. గ్రామాల్లో పట్టణ వసతులు కల్పించే లక్ష్యంతో కేంద్రప్రభుత్వం శ్యాంప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ పథకాన్ని ప్రారంభించింది. ఈ మిషన్ కింద తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన నిధులను తెలంగాణ పూర్తిగా వినియోగించుకొన్నదని తెలిపారు. కేంద్రం ఇచ్చిన నిధులు సకాలంలో పూర్తిగా వినియోగించుకున్న రాష్ట్రాలకు కేంద్రం అవార్డులను మంగళవారం ఇస్తోంది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో అవార్డును మంగళవారం బహూకరిస్తారు. తెలంగాణ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్, కమిషనర్ నీతూప్రసాద్, స్పెషల్ కమిషనర్ ఆశా సంయుక్తంగా ఈ అవార్డును అందుకుంటారు.