తెలంగాణ

అక్టోబర్ 24 వరకు ఇంటర్ పరీక్ష ఫీజు గడువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 10: తెలంగాణలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల ఫీజు చెల్లింపునకు షెడ్యూలు ఖరారు చేశారు. బోర్డు కార్యదర్శి డాక్టర్ ఎ అశోక్ షెడ్యూలును సోమవారం నాడు విడుదల చేశారు. ఈ నెల 17వ తేదీ నుండి అక్టోబర్ 24 వరకూ ఎలాంటి అపరాధ రుసుం లేకుండా పరీక్ష ఫీజు చెల్లించవచ్చని, 100 రూపాయిల జరిమానాతో అక్టోబర్ 25 నుండి నవంబర్ 8 వరకూ ఫీజు చెల్లించవచ్చని చెప్పారు. 500 జరిమానాతో నవంబర్ 26 వరకూ, వెయ్యి రూపాయిల జరిమానాతో డిసెంబర్ 11 వరకూ, 2వేల జరిమానాతో జనవరి 2 వరకూ, 3వేల జరిమానాతో జనవరి 21 వరకూ, 5వేల జరిమానాతో ఫిబ్రవరి 4 వరకూ పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులకు ఈ షెడ్యూలు వర్తిస్తుందని ఆయన చెప్పారు. థియిరీ సబ్జెక్టులకు 460 రూపాయిలు, థియిరీ , ప్రాక్టికల్ సబ్జెక్టులకు 620 రూపాయిలు చెల్లించాల్సి ఉంటుంది. బ్రిడ్జికోర్సులో ప్రాక్టికల్ పరీక్షలకు అదనంగా 170 రూపాయిలు, బ్రిడ్జికోర్సులో థియిరీ సబ్జెక్టులకు 120 రూపాయిలు, మాథ్స్, రెండో అడిషనల్ లాంగ్వేజికి 460 రూపాయిలు, హ్యుమానిటీస్‌లో ఇంప్రూవ్‌మెంట్‌కు హాజరయ్యేవారికి 1050 రూపాయిలు, సైన్స్ గ్రూప్‌ల్లో ఇంప్రూవ్‌మెంట్‌కు హాజరయ్యేవారికి 1200 రూపాయిలు పరీక్ష ఫీజుగా చెల్లిచాల్సి ఉంటుంది.