తెలంగాణ

డీఎస్ దారిలోనే కొండా మురళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 10: టీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యుడు డీ శ్రీనివాస్ మాదిరిగానే పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సిందే తప్ప ఎమ్మెల్సీ పదవికి రాజీనామా కూడదని కొండా మురళి నిర్ణయం తీసుకున్నట్టు ఆయన సన్నిహిత వర్గాల సమాచారం. అభ్యర్థుల జాబితాలో తనకు టికెట్ దక్కలేదని పార్టీపై తిరుగుబాటు బావుటా ఎగరేసిన వరంగల్ ఈస్ట్ తాజా మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ భర్తకొండా మురళీ టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీగా ఉన్నారు. తనకు టికెట్ ఇచ్చేదీ లేనిదీ రెండు రోజుల్లో తేల్చాలని పార్టీకి కొండా సురేఖ ఆల్టిమేటమ్ జారీ చేసిన విషయం తెలిసిందే. సురేఖ హెచ్చరికను టీఆర్‌ఎస్ అధిష్టానం తీవ్రంగా పరిగణించింది. టికెట్ ఇవ్వకపోతే అసంతృప్తి వ్యక్తం చేసి ఉంటే కనీసం మలి జాబితాలోనైనా ఆమె అభ్యర్థిత్వాన్ని పరిశీలించే అవకాశం ఉండేదని టీఆర్‌ఎస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే ఆమె ఏకంగా పార్టీ అధినేత కేసీఆర్, మంత్రి కేటీఆర్‌పై తీవ్ర ఆరోపణలు చేయడాన్ని టీఆర్‌ఎస్ అధిష్టానం తీవ్రంగా పరిగణించింది. కొండా సురేఖ చేసిన ఆరోపణలను వరంగల్ జిల్లా పార్టీ నేతలు తీవ్రంగా ఖండించడమే కాకుండా, ఆ నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశాన్ని ఏర్పాటు చేసింది. వరంగల్ ఈస్ట్‌కు వేరే అభ్యర్థిని ఎంపిక చేయడానికి అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో సురేఖ భర్త కొండా మురళి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్న రాజ్యసభ సభ్యుడు డీఎస్ తనంతకు తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని ప్రకటించారు. అదే మాదిరిగా కొండా మురళీ కూడా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయకూడదని నిర్ణయం తీసుకున్నట్టు పార్టీకి సమాచారం అందింది.