తెలంగాణ

భూపంపిణీకి ధరాఘాతం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 30: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ పంపిణీ పథకానికి ‘్ధరాఘాతం’ తగిలింది. ఒక్కో దళిత కుటుంబానికి ఈ పథకం కింద మూడెకరాల భూమి ఇస్తామంటూ 2014 ఆగస్టు 15న సిఎం కెసిఆర్ ప్రకటించారు. ఏటా 10 వేల మంది దళితులకు భూమి పంపిణీ చేస్తామని అప్పట్లో హామీ ఇచ్చారు. అయితే తదుపరి పరిణామాల్లో ఈ పథకం నెమ్మదించింది. ఒక్కో ఎకరాకు ఏడులక్షల రూపాయలు ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ, భూమి విక్రయించేందుకు ఆసామీలు ఎవరూ ముందుకు రావడం లేదన్నది వివిధ జిల్లాల నుండి అందుతున్న సమాచారం. సుమారు నాలుగు వేల ఎకరాల భూమిని ప్రభుత్వానికి విక్రయించేందుకు రెండు నెలల క్రితం వరకు కొంతమంది రైతులు ముందుకొచ్చినప్పటికీ, జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరుగుతుందన్న ప్రచారం జరగడంతో వీరూ వెనక్కి తగ్గారు. జిల్లాల సంఖ్య పెరిగితే భూముల ధరలు కూడా పెరుగుతాయన్న ఊహాగానాల వల్ల రైతులు భూములు అమ్మేందుకు వెనకడుగు వేస్తున్నట్టు తెలుస్తోంది.
హైదరాబాద్ సహా చుట్టుపక్కల ఉన్న మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ, మెదక్ జిల్లాల్లో భూముల విలువ గత రెండు దశాబ్దాల నుంచి పెరుగుతూ వస్తోంది. ఈ ప్రభావం తెలంగాణలోని ఇతర జిల్లాలపైనా పడింది. తెలంగాణలోని మారుమూల ప్రాంతాల్లోనూ ఇప్పుడు భూముల ధరలకు రెక్కలొచ్చాయి. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న భూములను ఎకరాకు కోటి రూపాయల నుండి 10 కోట్లకు రియల్‌ఎస్టేట్ వ్యాపారం కోసం అమ్ముకుంటున్న వారు, ఆ సొమ్మును హైదరాబాద్ నుంచి వందా రెండొందల కిలోమీటర్ల దూరంలోని గ్రామాల్లో పెట్టుబడిగా పెడుతున్నారు. ఎకరా భూమి కోసం ఎంతైనా పెట్టుబడి పెట్టేందుకు వీరు వెనుకాడటం లేదు. దాంతో దళితుల కోసం భూమి కొనేందుకు ప్రభుత్వం ప్రయత్నించినప్పటికీ ఫలితం లభించడం లేదు.
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో దశాబ్దం క్రితం దాదాపు పదిలక్షల ఎకరాల సర్కారు భూములు ఉండేవి. గత కాంగ్రెస్ హయాంలో దాదాపు ఎనిమిది పర్యాయాలు భూముల పంపిణీ చేశారు. ఏ గ్రామంలో ఏ మూలలో ప్రభుత్వ భూమి ఉన్నా పంపిణీ చేయాలని అప్పట్లో నిర్ణయించుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం, సెంటు భూమి కూడా వదల్లేదు. ‘మా గ్రామంలో ప్రభుత్వ భూమి పంపిణీకి లేదు’ అంటూ ప్రతి గ్రామానికి చెందిన గ్రామ రెవెన్యూ అధికారి నుంచి ప్రభుత్వం సర్ట్ఫికెట్టు తీసుకుంది. ఈ సర్ట్ఫికెట్‌ను సంబంధిత తహశీల్‌దారు, సంబంధిత రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్‌డిఓ), జిల్లా కలెక్టర్లు ఆమోదముద్ర వేయాలని అప్పట్లో ఆదేశించడంతో మారుమూల గ్రామాల్లోనూ ఉన్న ప్రభుత్వ భూములన్నింటినీ గుర్తించి పేదల పేరిట పంపిణీ చేసేశారు.
ఈ పరిస్థితిలోనే భూమి పంపిణీ పథకానికి భూమి లభించడం లేదని సాంఘిక సంక్షేమ శాఖ కమిషనర్, ఎస్సీ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఎంవి రెడ్డి తెలిపారు. సోమవారం ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ 2014-15లో 798మంది దళిత కుటుంబాలకు 2110 ఎకరాలను పంపిణీ చేయగా, 2015-16లో 2066 దళిత కుటుంబాలకు 5385 ఎకరాలను పంపిణీ చేశామని చెప్పారు. 2016-17లో ఇప్పటి వరకు 177 మందికి 491 ఎకరాలు మాత్రమే పంపిణీ చేశామన్నారు. అంటే ఇప్పటి వరకు 30141 మంది దళితులకు 7987 ఎకరాల భూమి అందించామన్నారు. ఇప్పటి వరకు భూములను కొనుగోలు చేసేందుకు సరాసరిన ఒక్కో ఎకరానికి 4 లక్షల 19 వేల రూపాయల వరకు ఖర్చు చేశామన్నారు. ఒక్కో ఎకరానికి ఏడులక్షల రూపాయలు ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ, భూములు లభించడం లేదని ఆయన వివరించారు.